బీహార్ ఎన్నికలపై ఓటర్ల నాడీ ఎలా ఉందని అంశం పైన ఓట్ వైబ్ అనేటువంటి సర్వే సంస్థ తాజాగా బీహార్ ఎన్నికల సర్వే ఫలితాలను తెలియజేసింది. ఇందులో బిజెపి, జెడియూతో కూడిన ఎన్డీఏ కూటమి, అలాగే ఆర్జెడి, కాంగ్రెస్ తో కూడిన మహాకూటమికి మధ్య హోరాహోరీ గానే ఉంటుందంటూ తెలియజేస్తోంది. సర్వే తెలిపిన ప్రకారం మహాకూటమికి మద్దతుగా 34.7 శాతం మంది ఉన్నారని, ఎన్డీఏకు మద్దతుగా 34.4 శాతం మంది ఉన్నారని, ప్రశాంత్ కిషోర్ పార్టీకి 12.3% మద్దతిస్తున్నారని మిగిలిన 10 శాతం మంది ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారంటూ తెలుపుతున్నారు.
ఈ సర్వేలో పరిశీలకమైన కారణాలను తెలియజేస్తూ .. ఛత్ పండుగ తర్వాత వలసలు వెళ్లిన కార్మికులు తిరిగి వచ్చి మళ్ళీ ఎన్నికలలో ఓటు వేస్తారని అంచనా ఉన్నదట.వీరి ఓటు బీహార్లో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. 51 శాతం మంది ఓటర్లు కులం కంటే పార్టీని చూసి ఓటు వేస్తామని, 27% మంది పార్టీ కంటే కులమే అన్నట్లుగా తెలుపుతున్నారట. అలాగే తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీ ఇంటికోక ప్రభుత్వ ఉద్యోగం,ఎన్డీఏ కూటమి రూ .10 రూపాయల కంటే ఈ హామీ ఎక్కువ ప్రభావం చూపుతోందని సర్వేలో తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ కి 12.3 % మంది ఓటు వేస్తామని చెబుతున్నప్పటికీ అందులో 48 శాతం వరకు పార్టీ గుర్తు తెలియని వారే ఉన్నారట. మరి బీహార్ ఎన్నికల పైన ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి