అమిత్ షా మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే బీహార్ అభివృద్ధిని నిజంగా ఆకాంక్షించే నాయకుడు. నితీష్ కుమార్ పాలనలో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. నక్సలిజం నుంచి బీహార్‌కు విముక్తి కల్పించేందుకు ఎన్డీఏ నిరంతరం కృషి చేస్తోంది” అని చెప్పారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, “మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది — మీరు అభివృద్ధిని కోరుకుంటారా, లేక మళ్లీ జంగిల్ రాజ్యాన్ని తెచ్చుకోవాలనుకుంటారా?” అంటూ ప్రశ్నించారు.అయితే, అమిత్ షా ఈ వ్యాఖ్యలతో ఎన్డీఏకు వచ్చిన పాజిటివ్ పబ్లిసిటీతో పాటు నెగిటివ్ రియాక్షన్ కూడా విపరీతంగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ ప్రముఖుల అభిప్రాయం ప్రకారం, “తన పార్టీని పొగడటం తప్పు కాదు, కానీ ప్రత్యర్థి పార్టీలను చిన్నచూపు చూడటం సరైన వ్యూహం కాదు. తన పార్టీ విజయంపై విశ్వాసం ఉంటే ఇలాంటి కామెంట్లు అవసరమా?” అని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, ప్రజల్లో కూడా విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమిత్ షా వ్యాఖ్యలను రాజకీయ వ్యూహంగా చూస్తుండగా, మరికొందరు “నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజంగా బీహార్ కోసం మంచి పనులు చేసి ఉంటే, ప్రజలు స్వయంగా ఓటు వేస్తారు; ఇలాంటి పోలికలు అవసరం లేదు” అని అభిప్రాయపడుతున్నారు.ఇక మరోవైపు, ప్రధానమంత్రి మోదీ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అవసరం లేని వివాదానికి దారితీసాయని భావించి, ఆయన అమిత్ షాకు “ఇలాంటి టంగ్-స్లిప్ కామెంట్స్ చేయరాదు” అని అర్ధ రాత్రి కాల్ చేసి మరీ క్లాస్ పీకారట. మొత్తం మీద, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కుదిపేశాయి. అధికారపార్టీ అయిన ఎన్డీఏ మరియు ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ నేతల మధ్య మాటలు తూటాలులా మారుమోగుతున్నాయి. ఎవరు గెలుస్తారు? ప్రజలు అభివృద్ధిని ఎంచుకుంటారా లేక పాత రాజకీయం పునరావృతమవుతుందా? అన్నది ఇప్పుడు బీహార్ ప్రజల ఓట్లతోనే తేలనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి