ఈ మధ్యకాలంలో క్రైమ్ స్టోరీలను చూసి చంపేస్తున్నట్లుగా ఎన్నో విషయాలను మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీ పోలీసులు ఒక భయంకరమైన హత్య కేసును చేదించినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులు తెలిపిన ప్రకారం ఒక యువతి, యువకుడు మే నెల నుంచి తిమర్పూర్ లో ఉండే గాంధీ విహర్ లో సహజీవనం చేస్తుండేవారట. యువతి (అమృత) యూపీ ప్రాంతానికి చెందిన మొరాదాబాద్ లో బిఎస్సి ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేస్తోంది. ఆ యువకుడు(రామ్ కేశ్) యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు.



 ఆ యువకుడు అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించారని, వాటిని హార్డ్ డిస్క్ లో సేవ్ చేసినట్లుగా ఆ యువతి గుర్తించింది. వాటిని డిలీట్ చేయమని అతని కోరిన కానీ అతడు వినకపోవడంతో.. ఈ విషయాలను తన మాజీ బాయ్ ఫ్రెండ్ ను కలిసి అన్ని వివరించి అతను మరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నారని చెప్పి ఆ యువకుడుని చంపాలని కుట్ర చేశారు. ఈ హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు.


ఈనెల 5న యువతితో పాటు మరో ఇద్దరు కలిసి ఆ యువకుడు ఫ్లాటుకు వెళ్లి అతని గొంతు నులిమి, తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం ఆ మృతదేహం మీద నెయ్యి, మద్యం చల్లి గ్యాస్ సిలిండర్ ని ఎలా పేల్చాలో తెలుసుకొని మృతదేహం తల వద్ద గ్యాస్ సిలిండర్ పేలేలా ప్లాన్ చేశారు. తర్వాత . ఆలా ఫ్లాటులోనే ఆ మృతదేహం కూడా కాలిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా జరిగినప్పటికీ పోలీసులు మాత్రం కేసును చేదించారు.ఈ పేలుడు పై పోలీసులు విచారణ చేయగా.. పేలుడుకు ముందు ఇద్దరు యువకులు ముసుగు వేసుకొని మరి భవనంలోకి వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. ఆ తర్వాత ఒక యువతి కూడా బయటికి వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. ఆ యువతి ఫారెన్సీక్ చదువుతున్న విద్యార్థి అమృత చౌహాన్ గా గుర్తించారు. అమృత ప్రైవేట్ వీడియోలను తన బాయ్ ఫ్రెండ్ (రామ్ కేశ్) డిలీట్ చేసేందుకు అంగీకరించకపోవడంతో తన మాజీ ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అతడిని హత్య చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. నిందితులను అరెస్టు అరెస్టు చేసినట్లుగా తెలియజేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: