జూబ్లీహిల్స్ ఎన్నిక టాక్ గంట గంటకు మారుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చివరికి ఒకరికొకరు వార్నింగులు కూడా ఇచ్చుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు చాలా ర్యాష్ గా మాట్లాడి సంచలనంగా మారారు. అది మరువకముందే నవీన్ యాదవ్ కు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది.. ఉప ఎన్నిక సందర్భంగా  జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పలు కేసుల్లో రౌడీ షీటర్ల పేరు ఉన్నటువంటి వాళ్ళందరినీ పోలీసులు బైండోవర్ చేశారు.. దీంతో నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ను కూడా పోలీస్ అరెస్ట్ చేశారు.. ఈ విషయాన్ని తట్టుకోలేనటువంటి నవీన్ యాదవ్ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు నవీన్ యాదవ్ తాజాగా నామినేషన్ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి రౌడీషీటర్లను తీసుకువచ్చి  బీఆర్ఎస్ నాయకులను, ప్రజలను భయాందోళనకి గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

అయితే తాజాగా చిన్న శ్రీశైలం యాదవ్ వెంట మంత్రి సీతక్క ఇతర పార్టీ నేతలు ప్రచారం చేయడంతో రౌడీలతో మంత్రి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.  దీంతో చాలామంది నాయకులు వాళ్లతో ప్రచారం చేయాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు.. ఈ విధంగా సోషల్ మీడియాలో రౌడీలకు టికెట్ ఇచ్చారు.  వాళ్లు గెలిస్తే ప్రజలను ఉంచుతారా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో అసహనానికి గురవుతున్నారు నవీన్ యాదవ్. దీంతో తట్టుకోలేక ఆయన ఈ మధ్య బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను  బెదిరింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. "గల్లీ దాటరు ఇంటిని చూడరు" అంటూ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

దీంతో చాలామంది నేతలు,ప్రజలు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే మన పరిస్థితి ఏంటి అంటూ ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ బీఆర్ఎస్ కేడర్ ను లేకుండా చేస్తా అంటున్నారు..నిజంగానే లేకుండా చేస్తారా అని ప్రశ్నించగా.. ఏసేస్తా.. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్ లేకుండా చేస్తా అంటూ ధమ్కీ ఇచ్చారు. దీంతో ఈయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రౌడీలకు టికెట్లు ఇస్తే ఈ విధంగానే రాజకీయం ఉంటుందని ఇలాంటి వాళ్లు గెలిస్తే ప్రజలను బ్రతకనివ్వరంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: