మొంథా తుఫాను వల్ల గత కొద్దిరోజులుగా టిడిపి నేతలు అన్ని ప్రాంతాలలో అలర్ట్ అయ్యారు. కొద్ది రోజులుగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ లో జరుగుతున్న రచ్చ కొట్టుకుపోయినట్టు కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు పెను సంచలనాలను సృష్టించాయి. ఎన్నికల సమయంలో చిన్ని తన దగ్గర రూ .5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ ఆధారాలతో కొలికపూడి తెలియజేయడంతో ఈ విషయం మరింత సంచలనంగా మారింది. ఈ సందర్భంగా అటు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య డైలాగు వార్ ఓ రేంజ్ లో కొనసాగాయి. అలా ఇరువురి నేతలు పలు రకాల ఆరోపణలు చేసుకున్నారు.


సమయంలో విదేశీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరినేతలపైన సీరియస్ గానే ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపించాయి. ఇరువురి నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడాలనుకున్నప్పటికీ సీఎం చంద్రబాబు సూచన మేరకు విరమించుకున్నట్లుగా తెలిసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు వీరి విషయాల పైన దృష్టి పెడతారని ప్రకటించినప్పటికీ అంతలోపు మొంథా తుఫాను రావడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మరికొంతమంది మంత్రులు ప్రభుత్వ యంత్రాంగానంతో
మొంథా తుఫాను సహాయక చర్యల పైన ప్రత్యేకించి మరి దృష్టి పెట్టారు.


దీంతో అటు కొలికపొడి, చిన్ని మధ్య రచ్చ కొట్టుకుపోయినట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎంపీ ,ఎమ్మెల్యే మధ్య వివాదం కూడా సర్దు మునిగినట్టుగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదాన్ని కాలానికి వదిలేస్తారా? లేకపోతే సీఎం చంద్రబాబు పిలిచి మరి ఈ నేతలతో మాట్లాడతార అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ టిడిపిలో ఈ నేతలు మధ్య విభేదాలు బయట పెట్టడంతో టీడీపీ పరువు పోయేలా చేశారంటు సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: