 
                                
                                
                                
                            
                        
                        అమిత్‌షా మాట్లాడుతూ.. బీహార్ రాష్ట్రం గత కొన్నేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరించారు. “ప్రధానమంత్రి మోదీ బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ఎన్నో పనులు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు దారితీయడం — ఇవన్నీ మోదీ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయి,” అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వడం బీహార్ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. “బీహార్ సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల కోసం కర్పూరి ఠాకూర్ చేసిన సేవలకు ఇది సరైన గుర్తింపు. ఆయన కలలు కనిన సమానతా సమాజాన్ని సాధించాలన్న సంకల్పంతో ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది,” అన్నారు. బీహార్ అభివృద్ధి ప్రయాణాన్ని వివరించుతూ ..“నితీష్ కుమార్ నాయకత్వంలో బిహార్ సంపూర్ణ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా శక్తికరణ — ప్రతి రంగంలో బీహార్ ముందడుగు వేస్తోంది. ఒకప్పుడు నేరం, అవినీతి, భయం పాలైన రాష్ట్రం — ఇప్పుడు శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి ప్రతీకగా మారింది.”
ఆర్జేడీ పాలనపై విమర్శలు గుప్పించిన అమిత్‌షా, “ఆర్జేడీ హయాంలో బీహార్ ఆటవిక రాజ్యాన్ని తలపించింది. ఆ కాలంలో నేరాలు విరజిమ్మాయి, అభివృద్ధి ఆగిపోయింది, ప్రజలు భయంతో జీవించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చింది. బిహార్‌లో మళ్లీ అవినీతి, భయం రాజ్యమేలే రోజులు రాకూడదు. అందుకే ప్రజలు ఎన్డీయేను మరోసారి గెలిపించాలి,” అని పిలుపునిచ్చారు. ఇక భవిష్యత్తులో దర్బంగాకు భారీ ప్రాజెక్టులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. “దర్బంగాకు మెట్రో ప్రాజెక్టును తెస్తున్నాం. రామ్‌సర్క్యూట్‌లో భాగంగా సీతాదేవి ఆలయం నిర్మిస్తాం. పీఎఫ్ఐ వంటి దేశద్రోహ సంస్థలపై నిషేధం కొనసాగుతుంది. భద్రత, శాంతి, అభివృద్ధి — ఇవే మా ప్రాధాన్యతలు,” అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి అమిత్ షా బీహార్ ఎలెక్షన్స్ లో పొలిటికల్ గేమ్ ఛేంజర్ అయిపోయాడు అంటున్నారు రాజకీయ ప్రముఖులు..!!
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి