రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీపిసిసి చీఫ్ ఎప్పుడు అయ్యారో అప్పటినుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంచి ఊపు వచ్చింది.. ఇదే తరుణంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది. చివరికి రేవంత్ రెడ్డి ని నమ్మి  అధిష్టానం కూడా సీఎం పదవిని కట్టబెట్టింది. ఎన్నో ఇబ్బందుల మధ్య రేవంత్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించారు.కానీ సీఎం అయ్యాక అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. సొంత పార్టీ నాయకులే ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు.. కానీ రేవంత్ ఎక్కడా కూడా భయపడకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. ఓవైపు రాష్ట్రాన్ని పాలిస్తూ, మరోవైపు సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ, ఇంకోవైపు అధిష్టానం చేసిన పనులకు కూడా ఆయనే  కారకుడు అవుతున్నాడు.. ఈ విధంగా  అందర్నీ సెట్ చేయడానికి రేవంత్ రెడ్డి అల్లాడిపోతున్నారు. రేవంత్ కు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ గా మారుతుంది రాజకీయం. ఓవైపు అధిష్టానం ఒత్తిడి, మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక.. ఎలాగైనా గెలవాలని తాపత్రయం.. 

ఇక్కడ ఓడిపోతే మాత్రం రేవంత్ కు వచ్చే ఇబ్బందులు ఇక మనం చెప్పలేం.. జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ కి ఇవ్వాల్సిన టికెట్ ను పక్కనపెట్టి నవీన్ యాదవ్ కి అందించారు. కానీ అధిష్టానం మాత్రం ఓవైసీని గెలిపించి  మంత్రి పదవి అందించాలని అనుకుంది. కానీ రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కి టికెట్ ఖరారు చేశారు. ఇదే తరుణంలో ఓవైసీకి అధిష్టానం దగ్గర మంచి పేరుంది.. అదే ఓవైసీ కాంగ్రెస్ కు బీ టీం అయిపోయింది. ఈ విధంగా ఓవైసీ మాటలు అధిష్టానం వింటోంది. అంతేకాదు ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.కానీ ఈ విషయం అప్పటికి రేవంత్ కు తెలియదు. చివరికి వారికి జూబ్లీహిల్స్ టికెట్ కూడా దక్కకపోవడంతో ఓవైసీ నేత అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్లు రేవంత్ పై ఒత్తిడి పెడుతున్నారు.. ఎందుకంటే మైనారిటీ వర్గానికి ఒకరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అధిష్టానం ఆలోచించింది..

 రేవంత్ రెడ్డి దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇక వీళ్లే కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు.. దీనికోసం రేవంత్ పై ఒత్తిడి కూడా తెస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి అడిగారు. కానీ ఆయనకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇవ్వనటువంటి పదవి ఇచ్చారు. క్యాబినెట్ మంత్రి పదవి కాదు కానీ పూర్తిగా క్యాబినెట్ మంత్రులకు ఉండే హోదా ఉంటుంది.. సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యే అవకాశం కల్పించారు. మరోవైపు ప్రేమ్ సాగర్ కు  సివిల్ సప్లై కి సంబంధించిన చైర్మన్ పదవి అందించారు. అసంతృప్తితో ఉన్న నేతలను ఏదో ఒక విధంగా సంతృప్తి పరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా ఉన్న నేతలకు ఏదో ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తుంటే మరి కొంతమంది నేతలు పదవులు కావాలని పీక్కు తింటున్నారు. ఇలా అధిష్టానాన్ని కన్విన్స్ చేస్తూ నాయకులను కన్విన్స్ చేస్తూ రేవంత్ చాలా సతమతమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: