ప్రస్తుతం దేశం చూపు మొత్తం బీహార్ ఎన్నికలపైనే పడింది.. ఇక్కడ కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.. మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటూ ఎవరికి వారే గెలుపు తీరాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. బీహార్ లో ప్రస్తుతం  బీజేపీ అధిష్టానం మొత్తం వెళ్లి ప్రచారం చేస్తోంది. ఇక రాహుల్ గాంధీ అయితే మొత్తం బీహార్ కే పరిమితమై ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాంటి ఈ సమయంలో బీహార్ లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు బీహార్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. బీహార్ లో ఎన్డీఏ మరియు  మహాగాట్ బంధన్ కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతోంది. ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు వారి వారి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ విశ్లేషకుడైనటువంటి ప్రశాంత్ కిషోర్ జెన్ సూరజ్ పార్టీ కూడా  ఎన్నికల బరిలో ఉండబోతోంది. 

243 స్థానాలకు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది.. అలాంటి ఈ తరుణంలో కొన్ని సర్వేలు మాత్రం ఎన్డీఏ పార్టీ వైపే మొగ్గుచూపుతూ  రిజల్ట్ బయటపెడుతున్నాయి. ప్రముఖ పోల్ సంస్థ జేబీసీ సర్వే ఫలితాలను శనివారం ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాల్లో  ఎన్డీఏ కు 120 నుంచి 140 స్థానాలు వస్తాయని తెలియజేసింది. పోయినసారి కంటే ఈసారి నితీష్ కుమార్ ను దాటి 70 నుంచి 80 సీట్లు ఎన్డీఏ సాధించబోతుందని సూచించింది. ఆ తర్వాత జేడియు 101 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి 42 నుంచి 48 పరిమితమవుతుంది. మహా కూటమిలోని ఆర్జెడీకి 69 నుంచి 78 సీట్లు వస్తాయని తెలియజేసింది. ఇంతకుముందు బీహార్ లో బిజెపి కంటే ఆర్జెడికి ఎక్కువ సీట్లు వచ్చాయి.కానీ ఇప్పుడు ఆర్జెడి స్థానాన్ని బిజెపి కైవసం చేసుకోబోతోంది. కాంగ్రెస్ కు తొమ్మిది, సిపిఐ ఎంఎల్ కు 12 వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఆధ్వ

ర్యంలోని జన స్వరాజ్ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో బయటకు వచ్చింది. అలాగే ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత నితీష్ కుమార్ 29%  రెండవ స్థానంలో నిలిచారు. ఏ పార్టీ గెలిచిన ఒకటి రెండు శాతం మెజారిటీతోనే బయటపడతారని జేబీసీ పోల్ సర్వే సూచించింది. మరి చూడాలి ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: