కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు రాముని కూడా అరెస్టు చేశారు వీరిద్దరూ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలోనే వీరిని విచారించేందుకు 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన విచారణ జరిపిన తర్వాత కోర్టు ప్రతివాదుల్ని కౌంటర్ జారీ చేయాలని ఆదేశాలను జారీ చేస్తూ రేపటి రోజున(మంగళవారం) ఈ విచారణను వాయిదా వేసింది.
ఈ రోజున ఎక్స్చేంజ్ శాఖ పిటిషన్ పైన జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు రాము ఇచ్చేటువంటి స్పందన ఆధారంగానే కోర్టు వీరి కస్టడీ నిర్ణయం తీసుకోబోతోంది. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే మాత్రం మరిన్ని కష్టాలు తప్పవు.. మరొకవైపు కల్తీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్టు చేసి ఒక విడత కస్టడీ తీసుకొని మరి విచారించినటువంటి అద్దేపల్లి బ్రదర్స్ ను కూడా మళ్లీ కస్టడీకి ఇవ్వాలంటూ ఎక్స్చేంజ్ శాఖ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈ నెల ఆరవ తేదీన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి