జగన్ టూర్ నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులతో పాటు రైతులు కూడా భారీగానే తరలి వచ్చినట్లుగా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలలో నుంచి పెద్ద ఎత్తున హైవే పైకి ప్రజలతోపాటు, రైతులు చేరుకున్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం హైవే వరకు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు. దీంతో పోలీసులు సైతం వారిని నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడిన జగన్ అభిమానులను మాత్రం ఎక్కడికక్కడ పలకరిస్తూనే ముందుకు వెళ్తున్నారు.
ఇక జగన్ కృష్ణాజిల్లా పర్యటన చేస్తున్నాడని తెలిసి ఆ ప్రాంతంలో భారీ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఎవరు కూడా డీజేలు పెట్టకూడదని బైక్ ర్యాలీలు చేయవద్దని, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. అనుమతించిన వాటికి మించి మరి వాహనాలను తీసుకురాకూడదని, జనాలు గుంపులుగా రాకూడదంటూ సూచించారు. అనుమతి లేనటువంటి వైసీపీ నాయకులని కూడా ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు పోలీసులు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 10 వాహనాలు, 500 మందికి మాత్రమే అనుమతిస్తూ రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎస్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించేలా షరతులను విధించారు. ఇలాంటి నిబంధనలు పెట్టడంతో వైసిపి అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. రైతుల్ని కలిసేందుకు వెళ్తున్నా కూడా ఇలాంటి ఆంక్షలు ఎందుకంటు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి సాయంత్రానికి అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లికి జగన్ చేరుకోబోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి