బీహార్ లో ఎన్నికలలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ అక్కడి ఓటర్లను ఉద్దేశిస్తూ.. ఓటర్లతో ఇలా మాట్లాడుతూ.. మీరందరూ ఒక విషయాన్ని గమనిస్తే దేశంలో 90 శాతం మంది జనాభా దళితులు, వెనకబడిన వర్గాలు మహా దళితులు అత్యంత వెనుకబడిన వర్గాలు లేదా మైనార్టీ వర్గాలే ఉన్నాయంటూ తెలిపారు. అంతటితో ఆగకుండా మీరు ఇండియాలో 500 అతిపెద్ద కంపెనీల జాబితాలను తీసుకుంటే అక్కడ వెనుకబడిన లేదా దళిత వర్గాల నుంచి ఏ ఒక్కరు కూడా కనిపించారని తెలిపారు. వారందరూ టాప్ 10% నుంచి వచ్చారని వెల్లడించారు. వారందరూ పెద్ద ఉద్యోగాలలోకి వెళ్తారు , వారు సాయుధ దళాలలో కూడా కనిపిస్తూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు. మిగిలిన 90% జనాభా ఉండేవారు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం వహించడం మీరు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు.
దేశంలోని 90 శాతం మంది స్థలం ఉన్న ప్రజలు ,గౌరవంగా, ఆనందంగా జీవించాలని ఉద్దేశం తమ పార్టీకి ఉందని అందుకే కాంగ్రెస్ ఎల్లప్పుడూ కూడా వెనుకబడిన వర్గాల కోసం మాత్రమే పోరాడుతుందంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ విషయం పైన అక్కడ ప్రత్యర్థి పార్టీలు కూడా రాహుల్ గాంధీ పైన మండిపడుతున్నారు. సాయుధ దళాలలో కూడా కులం కోసం వెతుక్కుంటున్నారని 10 శాతం మంది ప్రజలు దానిని నియంత్రిస్తున్నారని చెప్పడం చాలా బాధాకరమని, ఇదంతా చూస్తూ ఉంటే మోదీ పట్ల ఆయనకు ఉన్న ద్వేషం ఎలాంటిదో అర్థమవుతోంది అంటూ వ్యాఖ్యానించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి