2025 ఏడాదికి గాను ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన నగర జాబితాలకు సంబంధించి టైమ్ అవుట్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం టాప్-10 జాబితాను సైతం విడుదల చేసింది. అయితే ఇందులో మొదటి స్థానం భారత వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరమే మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా సంస్కృతి, ఆహారం ,లైఫ్ స్టైల్, జీవన నాణ్యతత్వం, ఆధునిక మౌలిక సదుపాయాలు,అలాగే యువతులకు అనుకూలమైన వాతావరణాలతో సహా కొన్ని అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లుగా తెలుస్తోంది.


మొదటి స్థానంలో భారతదేశం ముంబై, రెండవ స్థానంలో చైనా బీజింగ్, మూడవ స్థానంలో చైనా షాంగై , నాలుగవ స్థానంలో థాయిలాండ్ చియాంగ్ మై, ఐదవ స్థానంలో వియత్నాం హనోయ్ , ఆరవ స్థానంలో ఇండోనేషియా జకార్తా, ఏడవ స్థానంలో హాంకాంగ్, 8వ స్థానంలో థాయిలాండ్ బ్యాంకాక్, తొమ్మిదవ స్థానంలో సింగపూర్ పదవ స్థానంలో దక్షిణ కొరియా సీయోల్ ఉన్నట్టుగా జాబితాను విడుదల చేశారు. అయితే ఈ సర్వే ప్రధాన నగరాలలో 18 వేల మంది పైగా నివాసితులను ఈ సర్వేలో పాల్గొనేలా చేశారు. ముఖ్యంగా చైనా రెండు స్థానాలను సంపాదించుకుంది. కానీ ఇక్కడ కేవలం 90 శాతం మంది మాత్రమే ఆనందాన్ని కలుగుతున్నారట.


ముంబై నివాసితులలో 94 శాతం మంది తమ నగరం తమకు ఆనందాన్ని కలిగిస్తోందని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాలలోని వారు 89% మంది స్థానికులు తాము ఉంటున్న మిగతా ప్రదేశాలతో పోలిస్తే ముంబై చాలా సంతోషకరంగా ఉందంటూ వెల్లడించారని తెలిపారు. అలాగే సంతోషకరమైన ఆసియా నగరాలలో స్థానం సంపాదించలెని  ప్రసిద్ధ నగరాల విషయానికి వస్తే.. సీయోల్, టోక్యో, సింగపూర్ తో పాటుగా ఆసియాలోని అత్యంత ప్రజాదారణ పొందిన కొన్ని గ్లోబల్ సిటీలు కూడా చాలా దిగువ స్థాయిలో ఉండడం గమనార్హం. టోక్యో ప్రాంతంలో నివసించేవారు కేవలం 70 శాతం మంది మాత్రమే సంతోష పరుస్తోందని తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: