జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏమో కానీ తెలంగాణ రాష్ట్ర నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏకధాటిగా పాలించినటువంటి కేసీఆర్ అండ్ టీం అవడంతో మూడవ దఫా కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఇదే సమయంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల్లో వీళ్లు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య  ఓ పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు.. ఇక వీరి మాటలకు తోడుగా మధ్యలోకి సినిమా వాళ్ళను కూడా లాగుతూ మరింత హైలెట్ అవుతున్నారు.. అయితే తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లా ఉన్నాయని విమర్శించారు. సినిమాల్లో శ్రీ లీల ఐటమ్ సాంగ్ కేటీఆర్ ప్రచారానికి ఎలాంటి తేడా లేదన్నారు. సొంత చెల్లెల్ని, మాగంటి తల్లిని అవమానించిన వ్యక్తి కేటీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తాడా అంటూ  సూచించారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి  బడ్జెట్ మిగిలి ఉందని,కానీ వీళ్ళు అధికారం నుంచి దిగిపోయే సమయానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేశారన్నారు. వాళ్ళ అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. సచివాలయం, ప్రగతిభవన్,కమాండ్ కంట్రోల్ రూమ్  లలో తెలంగాణ వాసులకు ఒక్క ఉద్యోగమైన వచ్చిందా అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పనులను కేసీఆర్ చెరిపేస్తే చెదిరిపోవని తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అలాంటి రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పదేళ్లు పాలించి అప్పుల కుప్ప చేసిందన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు వెనకేసుకొని దాన్ని చివరికి గాలికి వదిలేసారని సూచించారు. గత పది ఏళ్లలో జూబ్లీహిల్స్ అసలు ఏమీ అభివృద్ధి జరగలేదని ఈసారి మాకు అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ను అద్భుతంగా  అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా రాజకీయ నాయకులు ప్రచారాలు చేస్తూ సినిమా వాళ్ళని మధ్యలోకి లాగుతుండడంతో ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: