పల్నాడు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజనీ త్వరలో వైసీపీ ఇంచార్జ్ గా రేపల్లెకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయని వైసీపీ అధిష్టానం ఆమెకు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. చిలుకలూరిపేటలో కార్యక్రమాలు తగ్గించుకోవాలని రేపల్లెకు వెళ్లేందుకు సిద్ధం కావాలని అధిష్టానం నుంచి ఆమెకు సమాచారం కూడా వచ్చిందంటున్నారు. అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో రజనీ తీవ్ర అసంతృప్తి, అసహనానికి గురైనట్టు కూడా చిలకలూరిపేట నియోజకవర్గం లో ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటలో రజనీ ఎప్పటికీ గెలిచే పరిస్థితి లేదని ఆమె ఎప్పటికీ అక్కడ బలమైన అభ్యర్థి కాలేరన్న అభిప్రాయం బలంగా ఉండటంతో ప్రత్యామ్నాయం చూడాలని జగన్ మోహన్ రెడ్డి ప్లాన్‌గా తెలుస్తోంది. వాస్తవానికి రేపల్లెలో ప్రస్తుతం ఈపూరు గణేష్ ఇంచార్జ్ గా ఉన్నారు, కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అక్కడ వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది.
రేపల్లెలో బలంగా బీసీ సామాజిక వర్గం ఉంది. అది బీసీల నియోజకవర్గం కావడం మత్స్యకార వర్గానికి చెందిన తెలంగాణ ముదిరాజ్ వర్గానికి చెందిన విడుదల రజనీ అయితే మంచి అభ్యర్థి అవుతారని వైసీపీ భావించి ఉండవచ్చని అంటున్నారు. వాస్తవానికి రజనీ 2019లో చిలకలూరిపేట నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఆమె అక్కడ తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారని.. ఆమె గెలిచే అవకాశం లేదనే ఆమెను గుంటూరు వెస్ట్ సీటుకు మార్చారు. అక్కడ ఎంత డబ్బు వెదజల్లినా గల్లా మాధవి చేతిలో ఏకంగా 53 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల తర్వాత తిరిగి చిలకలూరిపేట ఇన్‌చార్జ్ గా పంపారు. ఇప్పుడు మళ్లీ తిరిగి పేట నుంచి రేపల్లెకు బదిలీ అంటున్నారట.
ఇలా తన స్థానం నుంచి వరుస పెట్టి ఆమెను గుంటూరు వెస్ట్.. ఇప్పుడు రేపల్లెకు మార్చడంతో రజనీ తన బాధను ఎవ్వరికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక చందంగా ఉన్నారని ఆమె అభిమానులు కూడా పేటలో గుసగుస లాడుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే .. అసలు వచ్చే ఎన్నికల నాటికి ఆమెకు సీటు అయినా ఇస్తారా ? లేదా ? హ్యాండ్ ఇస్తారా ? అన్న సందేహాలు కూడా ఆమె వర్గంలోనే ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి