ఓట్లు భద్రపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు స్ట్రాంగ్ రూమ్‌లను నిర్దిష్ట వ్యవధిలో తనిఖీ చేయాలని ఈసీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. భద్రత విషయమై ఎలాంటి రాజీ లేకుండా అత్యంత కఠిన చర్యలు చేపట్టారు.ఈసారి బీహార్ ఎన్నికల్లో అభూతపూర్వమైన ఓటింగ్ శాతం నమోదైంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించగా, మొత్తం 67.13 శాతం ఓటింగ్ నమోదు కావడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. భారీగా పోలింగ్ జరగడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ మరింత పెరిగింది.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీయే పక్షాన భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని సూచించాయి. ముఖ్యంగా నితీశ్‌కుమార్ మళ్లీ సీఎం కుర్చీని దక్కించుకోవచ్చని చాలా సర్వేలు అభిప్రాయపడ్డాయి. అయితే ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ నేత తేజస్వీ యాదవ్ ఈ అంచనాలను పూర్తిగా తోసిపుచ్చారు. తమ కూటమి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగని సాధారణ ప్రజల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. చాలా మంది ఓటర్లు ఈసారి కూడా బీహార్‌ను నడిపేది నితీశ్‌కుమార్‌నే అని నమ్మకంగా చెబుతున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డులు సృష్టించిన నితీష్, ఈసారి కూడా గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను రాయనున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఇంతటి ఉత్కంఠ మధ్య — బీహార్‌ను ఎవరు ఏలబోతున్నారు? ప్రజా తీర్పు దిశ ఎటు? అన్న దానిపై స్పష్టత మరికొద్ది గంటల్లోనే రానుంది. రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిశీలకులు — అందరూ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి