అన్ని ప్రాంతాలలో ఎన్డీఏ కూటమినే హవా కనిపిస్తోంది. సుమారు 90 సీట్లు దిగువన మహాఘాట్ బంధన్ కూటమి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావం కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా ముస్లింల ప్రాంతంలో కూడా ఎన్డీఏ హవానే కొనసాగుతోంది. బీహార్ ఎన్నికలలో మహాఘాట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్ పెద్ద కారణమనే విధంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా టికెట్లు కేటాయింపు దగ్గరే మహాఘాట్ బంధన్ కూటమి అడుగులు తడబడ్డాయని టికెట్ల కేటాయింపు తేల్చలేక పోవడం చివరి వరకు వాటిని సాగదీయడం వల్ల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని తెలుపుతున్నారు.
బిజెపి తరహాలో పెద్దన్న పాత్ర పోషించలేకపోయింది కాంగ్రెస్ అంటూ అక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకోలేకపోయారని దీని ప్రభావం కూడా RJD పార్టీ పైన తీవ్రంగా పడిందని మొత్తానికి మహాఘాట్ బంధం పార్టీ ఓటమి దిశగా ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆర్జెడి 75 సీట్లతో గెలవగా కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన వల్ల ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసింది. దీంతో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమిదే అధికారం అన్నట్టుగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి