గడిచిన కొన్నేళ్ల క్రితం నుంచి i-pac పేరుతో పొలిటికల్ కన్సల్టిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి సమస్యలు, డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూతు స్థాయి నిర్వహణ వంటివి చేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త ఆస్త్రాలతో ఎన్నో పార్టీలను గెలిపించారు ప్రశాంత్ కిషోర్. 2014లో మోదీ ప్రచారాలను సరికొత్తగా చూపించారు. అలాగే ఉత్తర ప్రదేశ్ యోగి కి రోడ్డు షోలు, బీహార్లో నితీష్ నాయక్, ఏపీలో జగన్ నవరత్నాలు, పంజాబ్లో అమరింధర్ సింగ్ కి కాఫీ విత్ కెప్టెన్, క్రేజీవాల్ కి ఉచిత సలహాలు, స్టాలిన్ కి కూడా ఎన్నో సలహాలు అందించారు. ఇలా అందరినీ గట్టెక్కించిన పీకే తన సొంత రాష్ట్రంలో మాత్రం బోల్తాపడ్డారు.
గత రెండు మూడేళ్ల నుంచి బీహార్ ఎన్నికలపైనే ప్రత్యేకించి దృష్టి పెట్టిన పీకే బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేశారు. అలా జన్ సూరజ్ పార్టీని స్థాపించి ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం వలస కట్టడి పైన ఎన్నో వాగ్దానాలను ఇచ్చారు. ప్రజలు పీకే రోడ్డు షోలకు భారీ స్థాయిలో హాజరైనప్పటికీ ఓట్లుగా మార్చుకోలేకపోయారు. ప్రశాంత్ కిషోర్ పోటీలో దూరంగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇక ఎన్నికలకు ముందు ఫలితాలను అంచనా వేసిన ఆయన వస్తే 150 లేకపోతే 10 సీట్లు వస్తాయంటు చెప్పేశారు. మోదీ, నితీష్ కుమార్ల విజయానికి గతంలో కృషి చేసిన పీకే, ఇప్పుడు వారి వ్యూహాల ముందు నిలబడలేక ఓడిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి