బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు అధికారం అందనంత దూరంలో ఉందన్న ఆయన.. కానీ, గెలుస్తున్న పార్టీలకు, అధికారంలోకి వస్తున్న పార్టీలకు కూడా బీసీలు, ఇతర సామాజిక వర్గాలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ.. ఆయా పార్టీల నుంచి అనుకున్న విధంగా పదవులు కానీ.. ఇతర రాజకీయ ప్రాధాన్యాలు కానీ దక్కడం లేదన్నారు. ఈ క్రమంలోనే బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు తాను విశ్రమించబోనని శపథం చేశారు.
ఇదేసమయంలో అన్ని జిల్లాల్లోనూ త్వరలోనే యాత్ర చేపట్టనున్నట్టు బోడే ప్రకటించారు. తద్వారా రా ష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఏకతాటిపై నడిపించే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. దీనికి అందరూ సహకరించాలని.. అన్ని సామాజిక వర్గాల వారు దన్నుగా నిలవాలని కోరారు. ఎక్కడ సమస్య ఉన్నా.. తాను ఉంటున్నానని.. కొందరు తనను కమ్యూనిస్టునని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. పనిలో కమ్యూనిస్టుగా ఉంటే తప్పులేదని.. కానీ, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటామన్నారు.
ప్రస్తుతం పార్టీ అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తాను చేపట్టే ప్రతి పోరాటానికి రైతులు అండగా ఉంటున్నారని.. కరేడులో చేపట్టిన ఉద్యమం ప్రభుత్వంలో కదలిక తీసుకువచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పనులు, ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రజలకు చేరువగా ఉండేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ఆయన వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి