ముఖ్యంగా అక్కడ అరటి తోటలను పరిశీలించిన మాజీ సీఎం జగన్ అక్కడ రైతుల పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు అండగా నిలుస్తానంటూ హామీ ఇచ్చారు. అరటి రైతుల టన్ను రూ .2000 రూపాయలు పలుకుతున్న వాటిని కొనే పరిస్థితిలో కూడా లేరని వ్యాపారస్తులు కూడా తోట వద్దకు రావడంలేదని దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని ఈ విషయంపై ప్రభుత్వం పైన ఫైర్ అవుతూ గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఉచితంగా పంటల భీమా ఉండేదని దీనివల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీ ఎప్పటికప్పుడు అందించే వాళ్ళమని, అలాగే బనానా కోల్డ్ స్టోరేజ్ ను కూడా ప్రారంభించామని తెలియజేశారు. ఇలాంటివి రైతులకు కల్పించడం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ వెల్లడించారు.
ఇటీవల టిడిపి నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నటువంటి వైసీపీ మండల పరిశీలకుడు లింగల రాముని పరామర్శించారు. బెస్తవారిపల్లె లో జీతాలు రాక చాలామంది హాస్టల్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామని జగన్ వినతి పత్రం అందించారు. 2029లో కచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాని తెలియజేస్తూ అక్కడ ప్రజలకు, కార్యకర్తలలో ధైర్యాన్ని నింపారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే పలువురు నాయకులను కూడా వైయస్ జగన్ కలిశారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే.. 2024 ఎన్నికల సమయంలో జగన్ మీద వ్యతిరేకత ఉందనే విధంగా వినిపించాయి కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే పూర్తిగా అక్కడ ప్రజలు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోందని తెలియజేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి