ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి.ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో గోదావరి జిల్లాల పచ్చదనానికి తెలంగాణ దిష్టి తగిలిందని ఆయన చేసిన కామెంట్లు తెలంగాణ ప్రజలకి అస్సలు నచ్చలేదు. పవన్ మాట్లాడిన వ్యాఖ్యలపై వెంటనే బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించి పవన్ కళ్యాణ్ ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పారు.ఆ తర్వాత కాంగ్రెస్ నుండి కూడా పిసిసి చీఫ్, అలాగే బల్మూరు వెంకట్, మరికొంతమంది రాజకీయ నాయకులతో పాటు రీసెంట్గా తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా స్పందించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఆయన సినిమాల్ని బ్యాన్ చేస్తామని చెప్పారు. అంతేకాదు చాలామంది తెలంగాణ వాళ్లు.. 

తెలంగాణ దిష్టి తగిలింది అన్నప్పుడు తెలంగాణలో ఉండడం ఎందుకు వెంటనే హైదరాబాద్ నుండి ఫ్యామిలీతో సహా వెళ్లిపోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై ఇన్ని విమర్శలు వచ్చినా కూడా పవన్ ఇప్పటివరకు నోరు విప్పి క్షమాపణ చెప్పలేదు.ఒక చిన్న వీడియో తీసి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. మీ మనసు బాధ పెట్టినందుకు క్షమించండి అని పవన్ ఒక రెండు మాటలు చెబితే తెలంగాణ ప్రజలు చల్లబడే వారు. కానీ క్షమాపణలు చెప్పాల్సింది పోయి తమ  నాయకుడు చెప్పిందే వాస్తవం అన్నట్లుగా జనసేన సమర్ధించుకుంటుంది.తాజాగా జనసేన పార్టీ నుండి పవన్ వ్యాఖ్యలపై ఒక ప్రకటన వచ్చింది. అందులో ఏముందంటే..పవన్ కళ్యాణ్ గారు రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో రైతులతో మాట్లాడుతున్నప్పుడు చేసిన కామెంట్లను వక్రీకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి స్నేహ వాతావరణము ఉంది.

ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలను వక్రీకరించవద్దు అంటూ ఒక ప్రకటన చేశారు.ఇక ఈ ప్రకటన వెలువడంతోనే చాలామంది మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పాల్సింది పోయి తిరిగి మేమే ఆయన మాటలు వక్రీకరిస్తున్నట్టు సమర్ధించుకుంటున్నారా.. చేసిన తప్పుకి క్షమాపణలు అడగాల్సింది పోయి ఇలా సమర్థించుకోవడం ఏమాత్రం బాగాలేదు. ఈ వివాదాన్ని పవన్ కళ్యాణ్ ఇలాగే కొనసాగిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ తెలంగాణ వాళ్లు మండిపడుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కొనసాగుతున్న వేళ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సఖ్యతను పవన్ కళ్యాణ్ తన మాటలతో చెడగొట్టేలా ఉన్నారు అని కొంతమంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే మాట్లాడుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: