కడప నగర మేయర్ ఎన్నికలలో టిడిపి తరఫున అభ్యర్థి బరిలోకి నిలవడం లేదంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో వైసిపి అభ్యర్థి మేయర్గా ఎంపిక అయ్యారు. వైసిపి కార్పొరేటర్లలో 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం మేయర్గా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. కడప కార్పొరేషన్ పాలకమండలిలో 50 మంది కార్పొరేటర్లు ఉండగా ఇందులో బోళా పద్మావతి, ఆనంద్ మృతి చెందారు.
జి ఉమాదేవి టిడిపి పార్టీ నుంచి గెలిచారు. మిగిలిన 47 మంది వైసీపీ కార్పొరేటర్లలో 8 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి చేరారు. దీంతో ప్రస్తుత వైసిపి కార్పొరేటర్ల సంఖ్య 39కి చేరింది. వీరందరూ కూడా కడప నగర కార్పొరేటర్గా పాకా సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే మేయర్ పదవి ఆశించి బంగ పడిన 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున మాత్రం ఈ ఎన్నికకు గైహాజరైనట్లుగా సమాచారం. టిడిపి పార్టీ ఎత్తుగడలను సైతం వైసీపీ పార్టీ ముందుగానే పసిగట్టి, ఎలాగైనా కార్పొరేషన్ పాలకమండలి చేజారకూడదని తగు జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ అయ్యారు.ఇక కళ్యాణ్ దుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి టిడిపి పార్టీ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ చైర్ పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి