సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయికి ఎదిగిన వారు ఎంతో మంది ఇప్పటికే రాజకీయాల్లోకి ఇచ్చారు. అలా హీరోలుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్ అయిన వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువ గానే ఉంది. కానీ ముఖ్యమంత్రి లుగా అయిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ గానే ఉంది. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఈ పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులను ఏదురుకున్నాడు. పార్టీని స్థాపించిన చాలా సంవత్సరాల తర్వాత కొంత కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీకి మంచి అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య మంత్రి గా కొనసాగుతున్నారు. తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొంత కాలం క్రితమే ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు.

ప్రస్తుతం ఈయన జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమానే తన చివరి సినిమా అని కూడా ఆయన ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ మరి కొంత కాలంలో జరగబోయే తమిళనాడు ఎన్నికల కోసం పూర్తిగా సిద్ధం అవుతూ వస్తున్నాడు. ఇకపోతే చాలా మంది విజయ్ మొదటి సారి ఎన్నికల్లోనే అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అవుతాడు అని భావిస్తూ ఉంటే మరి కొంత మంది ఈ మధ్య కాలంలో ఎంతో మంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వారికి మొదటి ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు దక్కలేదు. విజయ్ కి కూడా మొదటి ఎన్నికల్లో ఆ స్థాయి విజయం దక్కడం కష్టం అని , ఆయన రాజకీయాల్లో సక్సెస్ కావడం కోసం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుందేమో అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి విజయ్ మొదటి ఎన్నికల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను తమిళ రాజకీయల్లో సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: