సాధారణంగా మనిషికి కోపం అనేది ఉండాలి.. కానీ , ఆ కోపంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే స్పృహ కూడా ఉండాలి. లేకపోతే ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు విచక్షణారహిత విధంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం..

ఒకానొక సమయంలో వందనగిరి అనే రాజ్యాన్ని ప్రవీణుడు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు మంచివాడే కానీ కోపం ఎక్కువ. ఆ కోపం కారణంగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియక రాజ్యంలోని ప్రజలు సతమతమవుతూ ఉండేవారు.  ఇక ప్రవీణుడు రాజు కాబట్టి ఆయన వేసే శిక్షలు వెంటనే అమలు అయ్యేవి.

ఒకరోజు మహారాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు. అప్పుడు రాజుకు ఎంతో నమ్మకస్తుడు, పాకశాస్త్రంలో ఆరితేరినవాడు, మంచివాడు అయిన ధర్మయ్య మహారాజ దగ్గర వంటవానిగా పని చేస్తున్నాడు. ఆరోజు ధర్మయ్య వంట మొత్తం పూర్తి చేసి , అక్కడ పెట్టేసి తన కొడుకుకు అనారోగ్యం అవడంతో వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. వెళుతూ వెళుతూ మహారాజుకు ఆహారం వడ్డించే పనిని, వేరొక వ్యక్తికి అప్పగించి మరీ వెళ్ళాడు. ఆ వ్యక్తి మహారాజుకు అన్నం వడ్డించాడు. ఇక అన్నంలో కలుపుకున్న కూరలో కొద్దిగా కారం ఎక్కువ అవడంతో, ఒక్కసారిగా రాజు గారి నాలుక మండినట్టు అయింది.

వెంటనే రాజు కోపంతో వంటవాడిని  పిలుచుకురమ్మని ఆజ్ఞ వేశాడు. అంతే కాదు మరునాడు ఉదయమే ఉరిశిక్ష వేయాలని ఆజ్ఞ వేశాడు. ఇక రక్షకభటులు ధర్మయ్య ను  కర్మాగారంలో బంధించారు. ఇక  ఉరిశిక్ష తీయబోయే ముందు ధర్మయ్య చివరి కోరికని అడిగాడు.. నన్ను ఎలాగైనా రాజు దగ్గరకు తీసుకెళ్ళండి. అప్పుడు ధర్మయ్య  మహారాజుతో ప్రభు..! ఉరిశిక్ష తీయబోయే ముందు చివరి కోరిక ఏంటో అడుగుతారు కదా..! నా  కోరిక ఏంటో నేను అడుగుతాను అని అన్నాడు ధర్మయ్య.. అందుకు మహారాజు సరే అన్నాడు. దానికి ధర్మయ్య తనకు ఒక విల్లు , బాణం కావాలని అడిగాడు.

వెంటనే రాజభటులు ధర్మయ్య యొక్క విల్లు, బాణం ఇచ్చారు. ఇక ధర్మయ్య  విల్లుతో మహారాజుకి  బాణం గురి పెట్టాడు. రాజభటులు ధర్మయ్యను బంధించారు. ఇక మహారాజుతో  ధర్మయ్య.. ప్రభు..! కూరలో కారం వేసినందుకు  మీరు నా ప్రాణాలు తీశారు ..అనే మచ్చ మీకు వద్దు. బాణం గురిపెట్టాడు అన్న కారణంతో ఇప్పుడు నన్ను ఉరితీయండి." . అని అన్నాడు. ఇక కళ్ళు తెరుచుకున్న మహారాజు అప్పటి నుండి అందరిని ప్రేమానురాగాలతో చూసుకోవడం మొదలుపెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: