2024 లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఇక ప్రత్యేకమైన యువ జట్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం బిసిసిఐ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్లను పక్కనపెట్టి కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి ఎంపిక చేస్తుంది. అదే సమయంలో ఇక హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగిస్తూ వస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక 2023 ఏడాదిలో శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో కూడా ఇలాంటి జట్టును ఎంపిక చేసింది టీమిండియా.


 అయితే ఇక టి20 సిరీస్లో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించడంతో ఇక జట్టులో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టి20 మ్యాచ్లో మాత్రం టీమిండియా ఓడిపోయింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఎక్కడ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటే అటు బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేశారు. వాషింగ్టన్ సుందర్ సూర్య కుమార్ మినహా మిగతా ఎవరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.


 అయితే మ్యాచ్ ఓడిపోవడానికి యువ ఆటగాళ్లు జట్టులో ఉండడం అనుభవం లేమి కారణం అన్నది తెలుస్తుంది. దీంతో టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీని పక్కనపెట్టి టీమిండియా మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పటికైనా బిసిసిఐ ప్రయోగాలు పక్కన పెట్టి ఆ ఇద్దరిని టి20 జట్టులోకి తీసుకోవాలి అంటూ కోరుతున్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగిన మొదటి టి20 లో భారత జట్టులో ఉన్న యు ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత సీనియర్లు రోహిత్, కోహ్లీలు జట్టులోకి రావడమే మంచిది అని అనిపిస్తుంది అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: