ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న లియోనల్ మెస్సి గత ఏడాది జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు అని చెప్పాలి. అర్జెంటీనా జట్టుకు అందని ద్రాక్షలా కొనసాగుతున్న వరల్డ్ కప్ ను అందించాడు అని చెప్పాలి. అయితే నాలుగు సార్లు ఫిఫా వరల్డ్ కప్ అందుకోవడంలో విఫలమైన అర్జెంటీనా జట్టు చివరికి మెస్సి కెప్టెన్సీలో వరల్డ్ కప్ ని ముద్దాడింది. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ పై విజేతగా నిలిచిన అర్జెంటీనా జట్టు చివరికి ఇక వరల్డ్ కప్ గెలుచుకుంది అని చెప్పాలి. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లో లియోనల్ మెస్సి గోల్డెన్ బాల్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే గత ఏడాది వరల్డ్ కప్ ముగిసింది. ఇక ఇప్పుడు ఆ విషయం గురించి అందరూ మరిచిపోయారు. అయితే ఇలా వరల్డ్ కప్ ముగిసిన 45 రోజుల తర్వాత ఇక వరల్డ్ కప్ లో ఒక విషయంలో తన ప్రవర్తన తనకే నచ్చలేదు అంటూ ఇటీవలే లీయోనల్ మెస్సి స్పందించాడు. నెదర్లాండ్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా డచ్ బాస్ లూయిస్ వన్ గర్ల్ తో పాటు స్ట్రైకర్ వొవుట్ బెగ్గోస్ట్ లను కూడా హేళన చేస్తున్నట్లుగా తన రెండు చేతులను చెవుల మధ్య పెట్టి కోపంగా చూస్తూ ఫోజు ఇచ్చాడు.  ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.


 మెస్సి ఇలా చేశాడేంటి అని అభిమానులు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఈ విషయంపై స్పందించాడు మెస్సి.. గేమ్ లో భాగంగా కంట్రోల్ తప్పాను. ఆ సమయంలో అలా వచ్చేసింది. అలా చేయడం నిజంగా తప్పే అంటూ చెప్పుకొచ్చాడు.  నేను చేసింది నాకే నచ్చలేదు. అయితే దానిని మనసులో పెట్టుకొని ముందుకెళ్ళడం నాకు సాధ్యం కాదు. అందుకే ఆ రోజే ఏదో అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చుకున్నాను. మ్యాచ్ అన్నాక హై టెన్షన్ ఉండడం సహజం. ఈ టెన్షన్ లో ఒక్కోసారి మనం సహనం కోల్పోతాం అంటూ మెస్సి క్లారిటీ ఇచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: