ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..? ఇంకెప్పుడు..? అంటూ చినబాబు ఎట్టకేలకు తెగించి రోడ్డు మీదకు వచ్చేసారు. అసలే తాను వద్దని చెబుతున్నా వినకుండా ఆ అచ్చెన్నకు అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో తనను ఎవరు గుర్తించరు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినా సినబాబు, క్షణం ఆలస్యం చేయకుండా, ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి అందరినీ  పరామర్శిస్తూ, ఈ రాష్ట్రాన్ని ఏలబోయేది తానేనని, ఆ అచ్చెన్న కాదు అంటూ గట్టిగా జనాలకు వినపడేలా, అర్థమయ్యేలా చెప్పుకునేందుకు చంద్రబాబు తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తున్నారు. అసలు మొన్నటి వరకు ఇంట్లోనే కరోనా భయంతో ఉండిపోయారు.


70 ఏళ్లు దాటిన పెదబాబు రోడ్ల మీదకు వచ్చి హడావుడి చేయడం, గదిలోనే ఓ మూలన కూర్చుని జూమ్ జామ్ గా పార్టీ నాయకులతో మంతనాలు చేయడం వంటి ఎన్నో వ్యవహారాలను చక్కబెట్టే వారు. అప్పుడే అందరూ సిన బాబును ఆడిపోసుకున్నారు. ఏమయ్యా కుర్రవాడివి నువ్వు ఇంట్లో కూర్చుంటే, ముసలివాడైన మీ తండ్రి చూడు ఎంత కష్ట పడుతున్నాడో ? ఇలా అయితే ఏదో రోజు మీ డాడీ కి మండి ఆ అచ్చెన్నకు కానీ, ఆ పార్టీ బాధ్యతలు మొత్తం అప్పగించేస్తే నీ పని ఇక అంతే అంటూ గట్టిగానే హెచ్చరికలు చేసేయడంతో అలర్ట్ అయిపోయి రోడ్ల మీదకు వచ్చి ఇప్పుడు హడావుడి చేస్తూ, రైతులకు భరోసా ఇస్తూ, మీ వెనక నేనున్నానంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.  


పార్టీ నాయకులంతా ఇకపై తన మాటే వినాలని, అచ్చెన్న, బాబు అంటూ తన పరువు తీయొద్దు అని నెత్తి నోరు కొట్టుకుని మరీ బతిమిలాడేస్తున్నాడట. అసలు ఈ రాష్ట్రానికి సీఎం అవుతానా లేదా అని డౌట్ కూడా సినబాబుకి వచ్చేసిందట. ఒక వైపు జగన్ హవా పెరుగుతుందని, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఆయన మాత్రం జనాల్లో దూసుకుపోతూ, విమర్శలు చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వరదల్లో వచ్చిన బురదను ఏదో రకంగా జగన్ కు అంటించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఆ బురదను మతిమరుపుతో తానే రాసేసుకుంటూ చిత్ర విచిత్ర విన్యాసాలెన్నో చేసేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం సినబాబు  ధైర్యం చూసి నవ్వాలో ఏడవాలో , భయపడాలో తెలియక తమ్ముళ్లు గిలగిల్లాడిపోతున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: