వివాదాస్పద స్వామీజీ నిత్యానందపై అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కోలీవుడ్ నటి మీరామిథున్. తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. నిత్యానంద ఓ దీవిని కొనుగోలు చేసి, దానిని ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ పేరిట ప్రత్యేక దేశంగా ప్రకటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి కరెన్సీని కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.