డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు క్రైస్తవులు ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్తారు. ఈ నెల రోజులు చర్చ్ లు, ప్రాచీన క్రైస్తవ కట్టడాలు, స్టార్ హోటల్స్, ఇళ్లు విద్యుత్ కాంతులతో కళకళలాడుతాయి. ముఖ్యంగా ప్రతీ ఇంట్లో స్టార్, క్రిస్మస్ ట్రీని ఉంచుతారు. ఎన్నో బహుమతులతో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఇంతకీ ఆ క్రిస్మస్ ట్రీ ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

 Image result for christmas shopping in hyderabad

క్రైస్తవులకు పెద్ద పండగ క్రిస్టమస్. ఈ పండగ కోసం క్రైస్తవులు సిద్దమవుతున్నారు. చర్చ్ లు, స్టార్ హోటల్స్, క్రైస్తవుల ఇళ్లు విద్యుత్ దీపాలు, స్టార్, క్రిస్మస్ ట్రీ తో కనువిందు చేస్తున్నాయి. అందమైన ఇంటీరియర్ తో క్రిస్మస్ కి ముందు నుంచే సర్వాంగసుందరంగా డెకొరేట్ చేస్తున్నారు. క్రిస్మస్ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం కచ్చితంగా క్రిస్మస్ ట్రీ అని చెప్పొచ్చు.  క్రిస్మస్ ట్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ శాంతి చేకూర్చే దేవుడు, మానవులకోసం చనిపోయి మళ్లీ జన్మించిన ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టుకుంటారు. నెలరోజులపాటు దీన్ని సుందరంగా తీర్చిదిద్దుతారు.. పవిత్రంగా భావిస్తారు..

 Image result for christmas shopping in hyderabad

క్రిస్మస్ ట్రీ అనగానే అలంకరించబడిన చెట్టు.! సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి సతతహరిత సూదిమొన ఆకులు కలిగిన చెట్టు గుర్తుకు వస్తాయి. ఈ చెట్టు అలంకరణ క్రిస్మస్ వేడుకలతో ముడిపడి ఉంటుంది. బెత్లెహాంలోని  ఓ పశువుల పాకలో యేసు జన్మిస్తాడు. ఆ దేశంలో ఎక్కువగా ఆలివ్ చెట్లు ఉంటాయి. నిజమైన చెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు. ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు, రింగ్స్, బెల్స్  వంటి పలు రకాల వస్తువులతో అలంకరిస్తారు. ఇక స్టార్ యేసు జననాన్ని తూర్పు వైపు మిలమిల మెరిసే చుక్కను బట్టి గుర్తించాలని ప్రవక్తలు చెబుతారు. అలాగే బెత్లహాంలో యేసు జన్మించిన రోజు చుక్క కనిపిస్తుంది. దాని గుర్తుగా  క్రైస్తవులు తమ ఇంటికి నెల రోజులపాటు రంగు రంగుల స్టార్ ను అంకరించుకుంటారు..

 Image result for christmas shopping in hyderabad

ఇప్పుడు కృత్రిమ క్రిస్మస్ ట్రీలు దొరుకుతున్నాయి. కానీ గతంలో క్రిస్మస్ ట్రీలుగా సరుగుడు చెట్ల కొమ్మలను వాడేవారు. వాస్తవానికి ఇలా క్రిస్మస్ ట్రీలను అలంకరించుకోవడం జర్మనీలో ప్రారంభమైందని చెప్తారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజభవనంలో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. అది చాలా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాతే చాలా మంది ఇళ్లలోకి క్రిస్మస్ ట్రీ వచ్చి చేరిందని చెప్పుకుంటారు. పచ్చదనానికి, ఆనందానికి, సిరిసంపదలకు క్రిస్మస్ ట్రీని ప్రతీకగా భావిస్తారు. అయితే క్రిస్మస్ ట్రీకి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 1781లో కెనెడాకు చెందిన ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్ అనే సైన్యాధికారి తన సైన్యంలో ఉన్నవారికి క్రిస్మస్ విందు ఏర్పాటుచేశారు. అందులో ఒక చెట్టును క్యాండిల్ వెలుగులతో, పండ్లతో అలంకరించారు. అది అందరినీ ఆకట్టుకోవడంతో పలు దేశాలకు పాకినట్లు చెప్పుకుంటారు.

 Image result for christmas shopping in hyderabad

మన దేశంతో పోల్చితే విదేశాల్లో క్రిస్మస్ ట్రీకి ఆదరణ ఎక్కువ. మరింత అందంగా అలంకరించుకుంటారు. పెద్ద పెద్ద చెట్లను చర్చ్ ల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంటారు. ఇటీవలికాలంలో మన నగరాల్లోని షాపింగ్ మాల్స్, హోటెల్స్ లో కూడా ఇలాంటి పెద్ద పెద్ద ట్రీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. అలంకరణను కూడా దైవికంగా భావించి పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు. ఒక అడుగు నుంచి 10 అడుగుల ఎత్తున్న క్రిస్మస్ ట్రీలు కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: