తెలంగాణ రాష్ట్రంలో యాగ క్రతువులు నిర్వహించండంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ప్రతేకతను సంతరించుకున్నారు. సహస్ర చండీ యాగానికి ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నడుంబిగించారు. ఎందులో భాగంగా బుధవారం  నారాయణపురంలో నిర్వహించతలపెట్టిన  పొంగులేటి దంపతులు అంకురార్పణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు అంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ నిర్వహించ తలపెట్టిన సహస్ర చండీ యాగానికి  ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో వేదికను ఏర్పాటు చేశారు.



ఈ క్రమంలో యాగ క్రతువుకు  అంకురార్పణ చేశారు. వచ్చేనెల అక్టోబర్ 13 నుండి 17 వరకు ఈ యాగాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - మాధురి దంపతులు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి దంపతులు యాగానికి అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ మహా గణపతికి ప్రత్యేక పూజలు , శాంతి కార్యక్రమాలు, గణపతి హోమం నిర్వహించారు.  శృంగేరి పీఠానికి చెందిన వేద పండితులు, బ్రాహ్మణోత్తములు ఈ అంకురార్పణ లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో




ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పలువురు టీఆర్ఎస్ నాయకులు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. టిఆర్ఎస్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నాయకులు ఐలూరు వెంకటేశ్వర రెడ్డి, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఏ. మురళి, తూము చౌదరి, పో ట్ల శ్రీను, కొదమసింహం పాండు రంగాచార్యులు, కీసర వెంకటేశ్వర రెడ్డి, లక్కీ నేని రఘు, నిరంజన్ రెడ్డి, తిరుపతి కిషోర్, ఆకుల మూర్తి, కిలారు మనోహర్, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: