కనుమ.. సంక్రాంతి సందడికి క్లైమాక్స్ ఇది. సంక్రాంతి పండుగలో చివరి రోజు కనుమ. ఈ కనుమను పసువులకు కృతజ్ఞతాభావంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే.. వ్యవసాయం పశువులతో ముడిపడి ఉంటుంది. వాటి సాయంతోనే రైతులు ఆరుగాలం కష్టించి పంటలను పండిస్తూ సుఖసంతోషాలతో ఉంటారు.

 

మరి మనుషులకు ఇంతగా మేలు చేస్తున్న పశువులకు కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. అలా తెలిపేందుకు.. పశురాజాలను పూజించడానికి ఉద్దేశించిందే కనుమ. ఈ రోజున రైతులు తమ పశువుల్ని శుభ్రంగా కడిగుతారు. కొత్త మువ్వలు కట్టి వాటిని ముస్తాబు చేస్తారు. ఆ పశువులను పూజించి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు.

 

అంతే కాదు.. పశువుల పూజతో పాటు.. పితృ దేవతల పూజ కూడా కనుమ రోజు ప్రత్యేకత. మనం ఈ స్థాయిలో ఉండేందుకు అసలు కారణమైన మన పితృ దేవతలను స్మరించుకునే రోజులు ఈ కనుమ. అంతే కాదు.. కొన్ని ప్రాంతాల్లో కనుమ తరవాతి రోజును ముక్కనుమగా నిర్వహిస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: