డబ్బు అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్క మానవునికి డబ్బు మీద ఆశ ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉంటే మనము ఏ వస్తునైనా కొనగలము. కోటి విద్యలు కూటి కొరకే అన్న చందంగా ప్రతి మనిషి తన జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. అంతేకాకుండా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని, వారికి మెరుగైన జీవితం అందించాలని ఆశిస్తాడు. అది ఆధునిక యుగమైన, ప్రాచీనకాలమైన ఈ కోరికలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. దీని వలన మనకు గౌరవం వస్తుంది. కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ డబ్బుకు అధిపతి మాత్రం ఆ శ్రీ మహాలక్ష్మి.

ఈమె అనుగ్రహాం ఉంటేనే ఎవరికైనా సంపద వరిస్తుంది. అంతే కాకుండా లక్ష్మీదేవిని ఎంతో ఇష్టంగా ఆరాధిస్తే ఆమె వారిని సంపదకు సొంతం చేస్తుందని పండిస్తులు చెప్పేవారు. ఆమె కృపతో మనందరికీ సంపద, కీర్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా డబ్బు ఎటువంటి పరిస్థితుల్లో సాధించడం సాధ్యం కాదు. అదే విధంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవి కోసం ఉపవాసం ఉండి ఆరాధించాలి. ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం సమయంలో నువ్వుల నూనె, నెయ్యితో దీపారాధన చేయాలి. పసుపు, కుంకుమతో పూజించి గులాబీ పువ్వును ఆ లక్ష్మీదేవికి సమర్పించాలి. పాలు, బెల్లంతో తయారు చేసిన మిఠాయిలను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

అంతేకాకుండా తెల్లటి స్వీట్లు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అవసరమనుకుంటే రాగి లేదా వెండి పత్రాలపై శ్రీయంత్రాన్ని తయారు చేసి ఇంటి ఈశాన్య మూలలో లేదా మీ పూజ గదిలో ఉంచి ఆరాధిస్తే మంచిది. పై విధంగా చేయడం వలన మీకు జీవితంలో సంపద ప్రాప్తించడమే కాకుండా, మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు . కాబట్టి మీరు ఎంత మందిని ప్రార్ధించినా లక్ష్మి దేవిని మాత్రం తప్పక ఆరాధించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: