ఆంద్రప్రదేశ్ లో ఉన్న విశిష్టమైన దేవాలయాల్లో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. ఇది కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైల పట్టణంలో నిలయమై ఉన్నది. ఈ దేవాలయం పరమ పవిత్రమైనది మరియు చాలా పురాతనమైన దేవాలయం. శ్రీశైలంలో జన సాంద్రత చాలా తక్కువ. మన సంప్రదాయాలను సంస్కృతిని అద్దం పట్టే ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీశైలం ఆలయం చాలా పురాతనమైనది, విశిష్టమైంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న ప్రధాన దేవుడు మల్లికార్జున స్వామి. ఇక్కడ ఆ శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం 14 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆంధ్రలో అత్యంత సుందరమైన నల్లమల ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తులు నిత్యం దేశవిదేశాల నుండి వేల సంఖ్యలో వస్తుంటారు.

శీతాకాలంలో శ్రీశైల ప్రదేశం మరింత ఆహ్లాదకరంగానూ, సుందరమనోహరంగానూ ఎంతో కనువిందు కలిగించే సహజ అందాలతో వెలిగిపోతుంది. నల్లమల్ల కొండలపై కొలువై ఉన్న ఆ శ్రీ మల్లికార్జునుడు భక్తుల కోరికలను తప్పక నెరవేరుస్తారని ప్రతీతి. ఇక్కడ పూజలందుకుంటున్న మల్లికార్జునుడి లింగం దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటికావడం విశేషం.  ఆ లింగం ఎంతో అద్భుతమైన వెలుగుతో నిండి జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. కార్తీకమాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. ఈ మాసంలో భక్తులు భారీ సంఖ్యలో ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తారు.


ఈ కార్తీక మాసంలో ఆ భోళాశంకరుడి కోసం శివ మాల ధరించి...41 రోజుల పాటు సకల నిష్ఠలతో ఉండి..ఆ శివుడికి మొక్కు చెల్లిస్తారు.  ప్రధానంగా ఇక్కడ మహా శివరాత్రి నాడు దేవాలయం కోటి కాంతులతో ప్రత్యేక పూజలతో, ప్రత్యేక అలంకరణలతో మెరిసిపోతూ కనువిందు చేస్తుంది. ఈ వేడుకని చూసేందుకు భక్తజనం దూర ప్రాంతాలనుండి తరలివస్తారు. ఇక్కడ భక్తులు తమ కోరికలను ఆ స్వామితో చెప్పుకుంటే తప్పక తీరుస్తాడని భక్తుల ప్రఘాడ నమ్మకం మరియు విశ్వాసం.


మరింత సమాచారం తెలుసుకోండి: