ఇది హిందువుల ప్రసిద్ధ మతపరమైన పండుగ నవరాత్రులు. ఇది దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండాప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకుంటారు. ఈ పండగ దుర్గామాత మహిషాసురునిపై విజయం సాధించిన వేడుక. ఈ పండుగను హిందూ చాంద్రమాన క్యాలెండర్ లో అశ్విని నెలలో జరుపుకుంటారు. ఇది గ్రెగొరియన్ క్యాలెండర్‌లోని సెప్టెంబర్, అక్టోబర్ నెలకి అనుగుణంగా ఉంటుంది.

నవరాత్రి షష్ఠి తిథి నుండి, దుర్గా పూజ ఏర్పాటు చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నవరాత్రి లేదా దుర్గోత్సవాలలో ఎనిమిదవ రోజును దుర్గాష్టమి అంటారు. హిందూ మతం ప్రకారం ఇది మహా అష్టమి అని కూడా పిలుస్తారు. దుర్గోత్సవంలో అత్యంత పవిత్రమైన రోజు ఇది. ఈ రోజు హిందూ లూనీ-సౌర మాసం అశ్విని శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ సంవత్సరం 13 అక్టోబర్ 2021 న జరుపుకుంటారు.

దుర్గా అష్టమి 2021: ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ఇద్దరు రాక్షసులు శుంభ, నిశుంభ దేవతలను ఓడించి దేవలోకపై దాడి చేశారు. చంద, ముండాలను దేవలోకానికి పంపారు. దేవతలంతా కాపాడమంటూ దుర్గామాత శరణు వేడారు. దేవతల ప్రార్థనలు విన్న మాత పార్వతి మాతా చండీని సృష్టించింది. అష్టమి రోజున మాతా చండీ చంద, ముండాలను చంపింది. ఆమె వారి తలలను మాత పార్వతి వద్దకు తీసుకువచ్చింది. అందుకే చండీ దేవికి చాముండ అని పేరు పెట్టారు.

మహాష్టమి నాడు, 64 మంది యోగినిలను పూజించే ఆచారం, అష్ట శక్తి దుర్గామాత చాలా ముఖ్యమైన పూజ. ఈ శక్తులు అనేక శక్తులను సూచించే తల్లి దుర్గా అవతారాలు. దుర్గోత్సవ సమయంలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, ఇంద్రాణి, చాముండ అనే ఎనిమిది శక్తులను పూజిస్తారు.

దుర్గా అష్టమి 2021: సంధి పూజ
దుర్గోత్సవంలో సంధి పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అష్టమి తిథి ముగిసి నవమి తిథి ప్రారంభమయ్యే సమయం ఇది. ఇది రోజులో ఏ సమయంలోనైనా జరగవచ్చు. దాదాపు 48 నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో సంధి పూజ మాత్రమే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: