యాదాద్రి ఆలయం కొత్త హంగులతో రూపు దాల్చింది. భక్తులకు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తోంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ యాదాద్రి మూలవర్ల దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగించనుంది. అయితే.. ఈ శుభ సందర్భంలో ఈ యాదాద్రి కొత్త ఆలయం ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఈ యాదాద్రి ఒకప్పుడు గుహాలయం మాత్రమే ఉండేది. అంటే గర్భగుడి ఓ గుహలా ఉండేది. అలాంటి యాదాద్రి ఇప్పుడు పునర్నిర్మాణం తర్వాత అపర వైకుంఠంలా విలసిల్లుతోంది.

యాదాద్రి ప్రత్యేకతలు ఇవీ

1.
యాదాద్రి ఆలయం ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మితమైన ఆలయంగా ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. అలాంటి దివ్యధామంగా దేశంలో ఇప్పుడు ఇదొక్కటే. ఈ ఆలయం కోసం రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలు వినియోగించారు.

2.
ఈ ఆలయం కోసం ఇద్దరు స్థపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు పని చేశారు. దాదాపు 1500 మంది కార్మికులు నిరంతరం శ్రమించారు. సుమారు 66 నెలల పాటు వారు శ్రమించి ఈ  మహాలయాన్ని మనకు అందించారు. ఇక ఇప్పుడు ఈ యాదాద్రి ప్రపంచాన్ని ఆకట్టుకునేలా తరతరాల పాటు నిలిచేలా నిర్మితమైంది.

3.
యాదాద్రి పునర్మిర్మాణ పనులు 2016 అక్టోబరు 11న ప్రారంభం అయ్యాయి. ఆలయానికి ఉపయోగించిన కృష్ణశిలను గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల నుంచి సేకరించారు.

4.
పశ్చిమదిశన మహారాజగోపురం ఏడంతస్తుల్లో 77 అడుగుల ఎత్తులో నిర్మించారు.
పశ్చిమదిశన మహారాజగోపురంపై 11 కలశాలను ప్రతిష్ఠాపించారు.


5.
ఇక ఉత్తర, దక్షిణ, తూర్పు రాజగోపురాలు ఐదంతస్తుల్లో 55 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఉత్తర, దక్షిణ, తూర్పు గోపురాలపై 9 కలశాల ప్రతిష్ఠాపించారు.

6.
ఇక 45 అడుగుల ఎత్తులో గర్భాలయంపై దివ్య విమాన గోపురం నిర్మించారు. దివ్య విమానగోపురంపై శ్రీసుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించే గోపురం ఎత్తు మూడంతస్తులలో 33 అడుగులు ఉంటుంది.

7.
గర్భాలయంలోకి ప్రవేశించే గోపురంపై 5 కలశాల ప్రతిష్ఠాపించారు. మహాముఖమండపంపై 12 అడుగుల ఎత్తులో 12 అళ్వారుల విగ్రహాలు ఏర్పాటు చేశారు.

8.
ఆదిలాబాద్ అడవుల నుంచి సేకరించిన  నారవేర కర్రతో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.

9.
మొత్తం రూ.2 వేల కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. యాదాద్రి ప్రధానాలయ నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: