
ద్వాదశి రోజున..
కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు.తులసి లక్ష్మిదేవి ప్రతి స్వరూపం కనుక విష్ణువుకు ప్రతి రూపమైన శాలిగ్రాహునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు.అటువంటి శుభసమయంలో తులసి ఆకులను అస్సలు తుంచకూడదు.అటువంటి సమయంలో తులసి ఆకులను దించడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు ఏర్పడి దాంపత్య జీవితం అగమ్యగోచరంగా మారుతుందని,వేద పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు.కావున ప్రతినెలా వచ్చే ద్వాదశి రోజున అస్సలు తులసి ఆకులను తుంచకండి.
సాయంత్రం వేళ..
సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇంట్లోకి ఎక్కువగా ప్రవేశిస్తుంది కనుక ఆ సమయంలో తులసిని అసలు తుంచకూడదు.దీనిని తెలియక తుంచడంతో కలిగే పాపం కన్నా తెలిసి దించడంతో కలిగే పాపం ఎక్కువగా ఉంటుంది.తెలిసి చేస్తే మాత్రం వారు కచ్చితంగా కటిక దారిద్రాన్ని చవిచూస్తారు.కావున ప్రతి ఒక్కరు సాయంత్రం వేళలో తులసిని ముట్టుకోవడం కానీ,తుంచడం కానీ అస్సలు చేయకండి.
శుక్రవారం..
లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిక ప్రీతికరమైన రోజైన శుక్రవారం పూట అస్సలు తులసి ఆకులను తుంచకూడదు.ఇలా చేయడం వల్ల వారింట్లో అనవసరమైన ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.
మంగళవారం..
ప్రతి ఒక్కరూ ఇంట్లో మంగళకరంగా ఉండాలని మంగళవారం పూట పూజలు చేస్తూ ఉంటారు.అలాంటి రోజున తులసి ఆకులను కోయడం వల్ల ఇంట్లో అమంగళం కలిగి,అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కావున మంగళవారం పూట అస్సలు తులసి ఆకులను కోయకండి.