వినాయక చవితి పండుగను హిందువులు చాలా గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు. వినాయక పండుగ ఆఫీసులలో ఇంట్లో ఇలా చాలాచోట్ల ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే వినాయకుడి విగ్రహాన్ని శుభ్రంగా ఉంచి శుభ్రమైన వస్తువుల ద్వారా పూజించడం వల్ల మంచి ఫలితాలను లభిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు ఈ పనులు చేస్తే వారికి అన్ని విధాలా కలిసొస్తుంది.


వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కడైనా సరే ఈశాన్యం వైపుగా ఉంచేలా చూసుకోవాలి. ఇది పవిత్రమైన దిశ కాబట్టి విగ్రహాన్ని ఈశాన్యం వైపుగా ఉంచాలి.


వినాయకుడి విగ్రహాన్ని మట్టితో మాత్రమే తయారు చేసిన వాటిని ఉపయోగించాలి. ఇతర వస్తువులతో చేసిన వాటిని తీసుకోకూడదు. ముఖ్యంగా ఎడమ వైపు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసుకోవడం వల్ల శాంతి, స్థిరత్వం వంటివి లభిస్తాయి. కుడి వైపున తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసుకోవడం వల్ల ఆర్థికంగా అన్ని విధాల కలిసొస్తుంది.


కూర్చున్న వినాయకుడు తీసుకోవడం వల్ల ఆ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారు. నిలబడి ఉన్న వినాయకుడిని తీసుకోవడం వల్ల ఉత్సాహం, చురుకుదనంతో పాటు విజయాన్ని సూచిస్తుందట.


రంగుల విషయానికి వస్తే వినాయకుడు విగ్రహం తెలుపు రంగు ఉండే వాటిని తీసుకుంటే శాంతి కలిగిస్తుంది.. పసుపు లేదా బంగారు రంగు విగ్రహాన్ని తీసుకున్నట్లు అయితే ఐశ్వర్యాన్ని అందిస్తుంది.



పూజ చేసేటప్పుడు ఇల్లు లేదా ఆఫీసును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి . వినాయకుడు చవితి రోజున ముఖ్యంగా గుమ్మం వద్ద ఉప్పునీటితో కడగడం వల్ల చాలా మంచి జరుగుతుంది. దీపాలు వెలిగించడం పువ్వులతో అలంకరించడం వంటివి వినాయకుడు ముందు చేయాలి.


ఇంటికి ద్వారం దగ్గర మామిడి ఆకులు, బంతిపూల తోరణాలను ఉపయోగించడం మంచిది. వినాయకుడు దగ్గర నాణేలతో ఉన్న నీరు ఉంచడం లేకపోతే మనీ ప్లాంట్ ను వినాయకుడి దగ్గర ఉంచడం మంచిది.


వినాయకుడు నిమర్జనం వరకు "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాలను పాటించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.అలాగే వినాయకుడికి ఇష్టమైన లడ్డులు, సున్నుండలు వంటివి సమర్పించి పూజించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: