తాజాగా పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ లు పుట్టపర్తికి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము, సిపి రాధాకృష్ణన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లతో పాటు పలువురు ప్రముఖులు  కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ఇద్దరు కూడా సాయి కుల్వంత్ హాల్ లోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థనలు చేసి వచ్చారు.అయితే ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పారు. 

చిన్న తనంలో అంటే సచిన్ టెండూల్కర్ ఐదవ తరగతి చదువుకునే సమయంలో ఆయన జుట్టు అచ్చం సత్యసాయిబాబా లాగానే ఉండేదని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ,స్కూల్లో ప్రతి ఒక్కరు అనేవారట. అంతే కాకుండా సచిన్ ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన జుట్టుని చూసిన చాలామంది సత్య సాయి బాబా జుట్టుతో ఉన్న చిన్న పిల్లవాడు అని పిలిచేవారట. అలా స్కూల్ టైం లో కూడా సచిన్ టెండూల్కర్ ని అలాగే పిలిచేసరికి హెయిర్ కట్ కూడా చేయించుకోవడానికి ఇష్టపడలేదట. అలా సత్యసాయిబాబా ని పోలి ఉన్న జుట్టు అని ప్రతి ఒక్కరు అనడంతో చిన్నతనంలో సచిన్ హెయిర్ కట్ చేయించుకునే వారు కాదట.

 ఇక ఈ విషయాన్ని స్వయంగా ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ బయట పెట్టారు. అలాగే సత్య సాయి బాబాతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయన్ని ఎన్నోసార్లు కలిసానని,నా మనసులో మెదిలే ఎన్నో ప్రశ్నలకు అడగకుండానే సత్య సాయిబాబా సమాధానం చెప్పేవారు అంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సచిన్ టెండూల్కర్.ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ చెప్పిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: