బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది.  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించేలా ఆడపడుచులు ఆటపాటలతో  బతుకమ్మను భక్తి శ్రద్దలతో జరుపుతుంటారు. తొలి ఎంగిలిపూల బతుకమ్మగా ఆలయాల్లో జరుపుకుంటారు. ఈ ఏడాది  రాష్ట్రప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ సంబురాల ప్రారంభానికి హన్మకొండలోని వేయి స్థంబాల దేవాలయం వేదికైంది.

  
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఇది. పల్లె నుంచి పట్నం వరకూ ఆడపడుచులు పూల పండుగను జరుపుకుంటారు.  స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడతారు. తొలిరోజు, చివరిరోజు బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మ సంబురాలు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది కాకతీయుల రాజధానిగా వెలుగొందిన వరంగలే.  తొలి రోజు వేయి స్థంభాల దేవాయలంలో జరిగే బతుకమ్మ వేడుకలకు వేలాది మంది మహిళలు తరలివస్తారు. ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ జరిగే పద్మాక్ష్మ గుండం పరిసర ప్రాంతాల్లో లక్షలాదిగా వచ్చే మహిళలతో నిండిపోతుంది.   


రాష్ట్ర పండగగా గుర్తించిన బతుకమ్మను ప్రభుత్వం అధికారిక సంబురాలను ఈ ఏడాది వరంగల్ నుంచి ప్రారంభింస్తోంది.   తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  హన్మకొండలోని వేయి స్థంబాల దేవాలయంలో జరిగే  వేడుకలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వచ్చే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన స్థానిక నేతలు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  మహిళలు భారీగా హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు.  


బతుకమ్మ సంబురాల సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రధాన ఆలయాలను అలంకరించారు. మహిళలు ఉత్సవాలను నిర్వహించుకునే ప్రదేశాల్లో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ దీప కాంతులతో ప్రత్యేకంగా అలంకారం చేశారు.  తొలి రోజు వేయిస్తంబాల గుడికి వేలాదిగా తరలివచ్చే మహిళలకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: