ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ జట్టు  టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక ఒక  సారి తన సారథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ మరోసారి కెప్టెన్ గా వచ్చాడు. దాదాపు రెండేళ్ల నిషేధం తర్వాత మళ్ళీ ఐపీఎల్ లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ మరోసారి సన్రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఓపెనర్గా బ్యాటింగ్ లో   చెలరేగి ఆడుతున్నాడు డేవిడ్ వార్నర్. ప్రతి మ్యాచ్ లో కూడా పరుగుల వరద పారించాడు డేవిడ్ వార్నర్.



 అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో అరుదైన రికార్డు డేవిడ్ వార్నర్ ను  ఊరిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి విదేశీ క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేసేందుకు డేవిడ్ వార్నర్ సిద్దమయ్యాడు. 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు  డేవిడ్ వార్నర్ కి  మరో 10 పరుగులు చేస్తే చాలు ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. అయితే నేడు కోల్కతా నైట్రైడర్స్ తో జరిగే మ్యాచ్లో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు ఐపీఎల్లో సురేష్ రైనా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మాత్రమే ఐదు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న విషయం తెలిసిందే.



 అయితే ఇప్పటివరకు సురేష్ రైనా ఐదు వేల  పరుగులు చేసిన ఆటగాడిగా మొదటి రికార్డు సాధించగా తర్వాత 178 ఇన్నింగ్స్ లో  కోహ్లీ 5759 రన్స్ చేశాడు.. ఆ తర్వాత 189 ఇన్నింగ్స్లో 5149 రన్స్ చేశాడు హిట్మాన్  రోహిత్  శర్మ. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం కేవలం 134 ఇన్నింగ్స్ లోనే 4990 చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5000 రన్స్  పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు తిరగరాయనుండగా అదే సమయంలో.. 5 వేల పరుగులు సాధించిన మొట్టమొదటి విదేశీ  ఆటగాడిగా కూడా డేవిడ్ వార్నర్ రికార్డ్ సృష్టించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: