ప్రతి సీజన్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి ప్లేఆఫ్ కి అవకాశాలు సాధించి ఫైనల్ వరకు చేరే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం మొదట నిష్క్రమించిన జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్నది . ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శనపై ధోనీ కెప్టెన్సీ పై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ పై కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పటిలా దూకుడుగా కాకుండా ఎంతో నెమ్మదిగా ఆడుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే ఇటీవల మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ తీరుపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్లో పూర్తిగా విఫలమైన మహేంద్రసింగ్ ధోని వచ్చే సీజన్లో బ్యాటింగ్లో బాగా రాణించాలంటే నెట్ ప్రాక్టీస్ సరిపోదు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నెట్లో సాధన చేస్తూనే మరోవైపు మైదానంలోకి బ్యాటింగ్ చేస్తేనే ఒత్తిడిని జయించగలుగుతాడు అంటూ తెలిపాడు సునీల్ గవాస్కర్. వయసు ప్రభావం కారణంగా ధోని లో వేగం తగ్గుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన సునీల్ గవాస్కర్.. మైదానంలో ఒత్తిడి మధ్య ఆడినప్పుడు మాత్రమే ధోని లో చురుకుదనం పెరగడానికి అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి