ఆశిష్ నెహ్రా ప్రకటించిన జట్టు ను చూసి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే... ఏకంగా తన జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం కల్పించకుండా పక్కనపెట్టాడు ఆశిష్ నెహ్రా. విరాట్ కోహ్లీ స్థానంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కి అవకాశం కల్పించాడు. కేఎల్ రాహుల్ డేవిడ్ వార్నర్ లను తన జట్టుకు ఓపెనర్లు గా ఎంపిక చేసిన ఆశిష్ నెహ్రా.. మూడవ స్థానంలో కోహ్లీ కి బదులు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక చేసాడు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.
గతంలో ఆర్సిబి బౌలింగ్ కోచ్గా పనిచేసిన.. ఆశిష్ నెహ్రా వేగంగా తన ఫేవరెట్ జట్టులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కీ స్థానం కల్పించకపోవడం తో అటు అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అదే సమయంలో తన జట్టు లో నాల్గవ స్థానంలో ఏబీ డివిలియర్స్... ఐదవ స్థానంలో ఇషాన్ కిషన్ ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా.. బ్యాట్స్మెన్లను ఎంపిక చేశాడు ఇక టోర్నమెంట్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన జొఫ్రా ఆర్చర్ తో పాటు రషీద్ ఖాన్ కి కూడా తన జట్టులో స్థానం కల్పించాడు ఆశిష్ నెహ్రా. ఏదేమైనా ఆశిష్ నెహ్రా తన జట్టులో విరాట్ కోహ్లీ కి స్థానం కల్పించకపోవడం మాత్రమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి