గత కొంత కాలం నుంచి టీమిండియా కెప్టెన్సీ మార్పు పై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.  ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించి మరోసారి రోహిత్ శర్మ సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు  ఐదవసారి టైటిల్ అందించిన నాటి నుంచి కూడా టీమిండియా కెప్టెన్సీ మార్పు పై  తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతుంది ఐపీఎల్లో ఎంతోమంది ప్రతిభ గల  ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక ఫైనల్కు వెళ్ళలేక ప్రతిసారి విఫలం అవుతున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై విరాట్  కోహ్లీ  కెప్టెన్సీ  పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.


 ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గా  ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కు కెప్టెన్ గా మార్చాలి అని డిమాండ్ ఎక్కువగా తెరమీదకు వచ్చాయి.  వన్డే టి20 లకు రోహిత్ శర్మను కెప్టెన్ గా మార్చి జట్టు బాధ్యతలు అప్పగించడంతో పాటు టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ ని  కెప్టెన్గా నియమించాలి అంటూ ఎన్నో డిమాండ్లు కూడా తెరమీదకు వచ్చాయి దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలి అంటూ వస్తున్న వార్తలపై ఎంతో మంది మాజీలు  స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.



 ఇటీవల విరాట్ కోహ్లీ ని టి20 వన్డే కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలి అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి కోహ్లీ ని  తొలగించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. 10 టి20 లకు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి విజయం సాధించాడు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.  విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే  టీమిండియాతో టి20 గెలిచిందని కెప్టెన్సీ మార్పు కావాలనే  వారు నోరు మూయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారుకృష్ణమాచారి శ్రీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: