కానీ ఈ సారి మాత్రం ఇక మొదటి మ్యాచ్ నుంచి కూడా రికార్డుల మోత మోగిస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు జట్టు నాలుగు మ్యాచ్ లలో కూడా విజయం సాధించింది. జట్టు అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో ప్రస్తుతం వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కోహ్లీ సేన దూకుడు చూస్తూ ఉంటే ఈ సారి టైటిల్ని గెలవడం ఖాయం అనే విధంగానే కనిపిస్తోంది.
మునుపెన్నడూ కనిపించని జోరు ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కనిపిస్తుంది అయితే ఇక ఇటీవల పంజాబ్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన బెంగళూరు జట్టు ఒక్క వికెట్ కూడా పడకుండానే టార్గెట్ చేదించి ఘన విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.ఎక్కువసార్లు పది వికెట్ల తేడాతో గెలిచిన జట్టుగా ఘనత సాధించింది బెంగళూరు జట్టు. ఇప్పటి వరకు నాలుగు సార్లు 10 వికెట్ల తేడాతో గెలిచింది అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా బెంగళూరు జట్టు 14 సెంచరీలు కొట్టగా ఇక తర్వాత స్థానంలో పంజాబ్ కింగ్స్ 13 సెంచరీలతో రెండవ స్థానంలో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి