నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్స్ క్రీడల పండుగ ఇటీవలే ప్రారంభమైంది. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఒలంపిక్స్ ఎట్టకేలకు  కఠిన నిబంధనల మధ్య జపాన్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఎంతో మంది భారత క్రీడాకారులు ఒలంపిక్స్ లో పాల్గొంటున్నారు. అయితే సాధారణంగా ఎప్పుడూ కూడా ఒలింపిక్స్ లో భారత్ మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ పథకాలనే గెలుచుకుంటుంది. ఇక బంగారు పథకాలను అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలుచుకుంటుంది భారత్.  ఒలింపిక్స్లో భారత్ ఎన్నో పథకాలను గెలవాలి అని భారత ప్రజలు ఆకాంక్షిస్తూ ఉంటారు . అయితే ఈ ఒక్కసారి మాత్రమే కాదు ఒలంపిక్స్  జరిగిన ప్రతిసారి భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించి పతకాలు గెలవాలని కోరుకుంటూ ఉంటారు.



 అయితే ఈ కోరుకోవడం వరకూ బాగానే ఉన్నప్పటికీ..  భారత్ కి ఎక్కువగా పథకాలు ఎందుకు రావు అన్న విషయాన్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఒక విత్తనాన్ని నాటితే అది పెరిగి పెద్దదై మొక్క అవుతుంది.  ఒక విత్తనం మొక్క అయిన తర్వాత మనకు ఫలాలను అందిస్తూ ఉంటుంది..  కానీ భారత్లో మాత్రం చాలా మంది ఇక పిల్లలు పాఠశాల స్థాయి నుంచే ఆటలకు దూరం చేస్తున్నారు. దీంతో వివిధ రకాల క్రీడలు పై అసలు పిల్లలకు అవగాహన ఉండటం లేదు. అయితే ఇటీవలే ధర్మవీర్ వీణ అనే ఐఎఫ్ఎస్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది.


 ఈ పోస్టులో ప్రస్తుతం భారత్లో జరుగుతున్నది యధావిధిగా చెప్పేసారు ధర్మవీర్ వీణ.  ప్రస్తుతం ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్ కోసం పెద్ద పెద్ద స్కూల్ కి పంపిస్తున్నారు. అయితే ఆ స్కూల్లో కేవలం వారానికి ఒకసారి మాత్రమే స్పోర్ట్స్ క్లాస్ ఉంటుంది. మిగతాది మొత్తం బట్టీలు పట్టిన చదువులే.  ఇలా కేవలం వారానికి ఒకరోజు స్పోర్ట్స్ క్లాస్ పెట్టి.. ఇక ఒలంపిక్స్ వచ్చేసరికి మాత్రం భారత్ వందల సంఖ్యలో మెడల్స్ సాధించాలి అని కోరుకోవడం  ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు ధర్మవీర్ వీణ.  అయితే ఇక ఈ ట్వీట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.  ఇది చూసి ఎంతో మంది తల్లిదండ్రులు ఆలోచనలో పడిపోయారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: