ఇటీవలే టోక్యో వేదికగా మెగా క్రీడల పండుగ ఒలంపిక్స్ ఎంతో విజయవంతంగా పూర్తయింది. అయితే ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో అటు భారత క్రీడాకారులు అద్భుతంగా సత్తా చాటారు. గతంతో పోల్చుకుంటే మెరుగైన ప్రదర్శన చేసి ఎక్కువ పతకాలు సాధించారు అని చెప్పాలి. అంతే కాకుండా ఇక వందేళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఏకంగా భారత్ గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ఇక పోతే ఇక ఇటీవలే ప్రారంభమైన పారాలింపిక్స్ లో కూడా భారత క్రీడాకారులు అద్భుతంగా దూసుకుపోతున్నారు. వరుసగా పథకాలు సాధిస్తూ ప్రస్తుతం సత్తా చాటుతున్నారు.


 అయితే ఒకప్పుడు భారత్ కి గోల్డ్ మెడల్ అంటే కేవలం అందని ద్రాక్షల మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మొన్న ఒలింపిక్స్ ఇప్పుడు  ఎప్పుడు పారాలింపిక్స్ లో కూడా క్రీడాకారులు ఎంతో అలవోకగా గోల్డ్ మెడల్ సాధిస్తూ  త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేస్తున్నారు. అటు టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఒక గోల్డ్ మెడల్ సాధించగా అటు పారాలింపిక్స్ లో మాత్రం వరుసగా భారత్ గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉండడంతో  విశ్వ వేదికపై త్రివర్ణ పతాకం రెపరెప లాడుతోంది.  ఇప్పటికే భారత్ 4 గోల్డ్ మెడల్స్ సాధించింది.



 ఇక ఇప్పుడు ఐదవ గోల్డ్ మెడల్ కూడా అటు భారత్ వశం అయింది. పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో కృష్ణ నాగర్‌ స్వర్ణంతో సత్తా చాటాడు. ఫైనల్లో హాంకాంగ్‌ ఆటగాడు కైమన్‌ చూపై కృష్ణ నాగర్ విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈరోజు పారాలింపిక్స్ లో భాగంగా ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. ఈ రోజూ ఉదయం బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించాడు. తాజాగా కృష్ణ గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటాడు . దీంతో పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: