భారత అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం అనేది ప్రతిఒక్క క్రికెట్ క్రీడాకారుడు కలగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టులో అవకాశం దక్కించుకునేందుకు అన్ని రకాల  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమ సత్తా చాటి భారత సెలెక్టర్ల చూపును ఆకర్షిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఐపీఎల్ ప్రారంభం కాకముందు భారత అంతర్జాతీయ జట్టులోకి యువ క్రికెటర్లను సెలెక్ట్  చేయడం అనేది బీసీలకు సెలెక్టర్లకు ఎంతో కష్టతరమైన పని గా ఉండేది. కానీ ఇటీవలి కాలంలోఐపీఎల్ పుణ్యమా అని అటు ప్రేక్షకులకు బిసిసిఐ సెలెక్షర్లకు కూడా భారత జట్టులోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై కూడా క్లారిటీ ఉంటుంది.


 ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ టోర్నీ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇక ఐపీఎల్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశం దక్కించుకోవడమే కాదు తన సత్తా చాటి ఇక భారత జట్టులో కూడా అవకాశం దక్కించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటివరకూ ఎంతోమంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించి  అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రంచేసిన వారు ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఆడిన టి20 సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్.



 ఇక తనదైన శైలిలో ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల తనకు అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం దక్కడంపై మాట్లాడిన వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ లకు స్పెషల్ థాంక్స్ చెప్పుకొచ్చాడు. సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్ భయ్యా నా దగ్గరకు వచ్చి నా చేతికి ట్రోఫీ ఇచ్చాడు. ఆ క్షణం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. తను అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి కెప్టెన్ రోహిత్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా సహకరించారు అంటూ చెప్పుకొచ్చాడు వెంకటేష్ అయ్యర్.ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు అంటూ వెంకటేష్ అయ్యర్ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: