భారత క్రికెట్లోకి మహేంద్రసింగ్ ధోని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. వచ్చిన కొన్ని రోజుల్లోనే తనదైన ఆటతీరుతో ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎంతో దూకుడైన ఆటకు మారుపేరు గా మారిపోయాడు రిషబ్ పంత్. అయితే మొదట్లో బ్యాటింగ్లో అద్భుతంగా రాణించిన పంత్.. అటు కీపింగ్ లో మాత్రం కాస్త నిరాశ పరుస్తూ వచ్చాడు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు రిషబ్ పంత్. అన్ని ఫార్మాట్లలో కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు. అదే సమయంలో ఇక ఇటీవల ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఉండే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు రిషబ్ పంత్.


 కెప్టెన్గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నాడు  అని చెప్పాలి.. ఇక భారత క్రికెట్లో కీలక ఆటగాడిగా మారిపోయి మిడిలార్డర్ బ్యాట్స్మెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే క్రికెట్లో ఒక్కసారి ఫేమస్ అయ్యారు అంటే చాలు ఇక ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో క్రికెటర్లు దర్శనమిస్తూ వుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే రిషబ్ పంత్ ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవలే మరోసారి ఈ యువ ఆటగాడు కి లక్కీ ఛాన్స్ దొరికేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషబ్ పంత్ ను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ స్వయంగా వెల్లడించారు.


 ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే యువతను క్రీడలో ప్రజారోగ్యం వైపు ఆకర్షించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.. అయితే స్వయంగా క్రికెటర్ రిషబ్ పంత్ కి వీడియో కాల్ చేసి ఇక ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక వీడియో కాల్ లో భాగంగా రిషబ్ పంత్ బాగోగులు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఈ క్రమంలోనే స్పందించిన రిషబ్ పంత్ ప్రజలకు క్రీడలు, ఫిట్నెస్ పై మరింత అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు అంటూ తెలిపాడు రిషబ్ పంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: