ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని దేశాల కంటే రిచెస్ట్ క్రికెట్ నియంత్రణ మండలిగా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు ఎక్కువగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి నిధులు అందుతూ ఉంటాయి. ఇక భారత క్రికెట్ లో ఆడిన ఆటగాళ్లకు మాత్రమే కాదు.. ఇక బీసీసీఐ లో ఏ పదవి సాధించిన కూడా భారీగా ఆదాయాన్ని సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా బిసీసీఐ లో కీలక పదవిలో కొనసాగే  అవకాశం వచ్చింది అంటే అందరూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రం ఏకంగా బిసిసిఐకి షాక్ ఇస్తూ కీలకమైన పదవికి రాజీనామా చేశాడు.



 ఇక ఇలా రాజీనామా చేయడానికి కారణం త్వరలో ఐపీఎల్ ప్రారంభం కావడమే అన్నది తెలుస్తుంది. మార్చి చివరికల్లా ఐపీఎల్ నిర్వహిస్తామంటూ బీసీసీఐ ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 12,13 వ తేదీలలో  మెగా వేలం కూడా జరగబోతుంది.  ఇక ఈ మెగా వేలం లో ఏ ఆటగాడు ఏ జట్టు లోకి వెళ్ళి పోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ఐపీఎల్లో గత కొన్ని సీజన్ నుండి  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సిఇఓగా కొనసాగాడు ధీరాజ్ మల్హోత్రా. ఇక ఆ తర్వాత బిసిసిఐ జనరల్ మేనేజర్ పదవి దక్కించుకున్నాడు.


 ఇటీవల ఈ పదవికి రాజీనామా చేస్తూ బిసిసిఐకి షాకిచ్చాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పదవికి నియామకమైన ధీరజ్ మల్హోత్ర ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి పని చేసేందుకు గాను బిసిసీఐ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇక ధీరజ్ మల్హోత్రా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో బిసిసిఐ కొత్త జనరల్ మేనేజర్గా మాజీ క్రికెటర్ సబా కరీం ను నియమించింది బీసీసీఐ. కేవలం బిసిసిఐ లో మాత్రమే కాదు ధీరజ్ మల్హోత్రా టు ఐసీసీలో కూడా ఎన్నో కీలక పదవులు చేపట్టి క్రికెట్ కు ఎంతగానో సేవలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: