అయితే ఇక దాదాపు రెండు సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ సెంచరీకి దూరం అయిపోయాడు. ఆ సమయంలోనే ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి విరాట్ కోహ్లీ అదర కొడతాడు అని అభిమానులు అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ అభిమానులకు నిరాశే ఎదురైంది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో అర్థ శతకం కూడా చేయలేకపోయాడు విరాట్ కోహ్లీ. 45 పరుగుల వద్ద శ్రీలంక బౌలర్ కు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
అయితే దీనిపై ఒక అభిమానికి చేసిన ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విరాట్ కోహ్లీ తన 100వ టెస్టులో సెంచరీ కొట్టలేడు.. కేవలం 45 పరుగుల వద్ద శ్రీలంక స్పిన్నర్ బౌలింగ్లో వికెట్ కోల్పోతాడు అంటూ ఒక అభిమాని ముందుగానే ట్విట్ చేసింది. శృతి అనే పేరుతో ట్విట్ చేసినట్లుగానే.. విరాట్ కోహ్లీ సరిగ్గా నలభై ఐదు పరుగుల వద్ద ఆమె చెప్పిన బౌలర్ చేతిలోనే వికెట్ కోల్పోయాడు. దీనిపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. ఇక ఆమె ఎలా అంత ఖచ్చితంగా చెప్పగలిగింది అన్నది మాత్రంమీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి