టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో సాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. తన స్పిన్ మాయా జాలంతో బ్యాట్స్మెన్లను తికమక పడుతూ కీలక సమయం లో వికెట్లు తీసుకుంటూ టీమిండియా విజయం లో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు. అంతేకాదు నేటి రోజుల్లో ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టు లోకి వచ్చి తీవ్రం గా పోటీ పెరిగి పోయినప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి.



 ఇలా ఇటీవలి కాలం లో టెస్టు ఫార్మాట్లో అయితే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతం గా రాణిస్తూ ఎన్నో వికెట్లను కొల్లగొడుతున్నాడు. అంతేకాకుండా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రవిచంద్రన్. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో సీనియర్ అశ్విన్ మరో మైలు రాయిని అందుకున్నాడు. టీమ్ ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కలిపి కేవలం ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయినప్పటికీ అరుదైన రికార్డు సాధించాడు.


 కాగా ఇప్పుడు వరకు మొత్తంగా రవిచంద్రన్ అశ్విన్ ఏకం  గా నాలుగు వందల ముప్పై ఐదు వికెట్లు సాధించాడు. దీంతో ఇక కపిల్దేవ్ (434 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ప్రస్తుతం ఈ జాబితా లో మొదటి స్థానం లో  టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మొదటి స్థానం లో ఉన్నాడు. ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 417 వికెట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అశ్విన్ అరుదైన మైలురాయిని అందుకోవడం తో అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: